పెరిగిన సన్నాల సాగు

ABN , First Publish Date - 2020-09-07T10:55:44+05:30 IST

వరి సాగు చేసే రైతులు దొడ్డు రకాలు తగ్గించాలి.. సన్న రకాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా లో సన్నాల సాగు భారీగా పెరిగింది. జిల్లాలో గత

పెరిగిన సన్నాల సాగు

జిల్లాలో భారీగా పెరిగిన సన్న రకాల సాగు

గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన రైతులు

ఈ సారి మద్దతు ధరకు మించి ఇవ్వాలంటున్న అన్నదాతలు  

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించిన అధికార యంత్రాంగం


నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

వరి సాగు చేసే రైతులు దొడ్డు రకాలు తగ్గించాలి.. సన్న రకాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా లో సన్నాల సాగు భారీగా పెరిగింది. జిల్లాలో గత సంవత్స రం కంటే రైతులు ఎక్కువగా సన్నరకాలను సాగు చేశారు. సన్నాలకు మద్దతు ధరకు మించి ప్రభుత్వం ధర కల్పిస్తుం దని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో వరి సాగు భారీగా పె రగడంతో పౌరసరఫరాల సంస్థ అధికారులు కొనుగోలు కేం ద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఈ వానాకా లంలో పంటల విస్తీర్ణం ఊహించని విధంగా పెరిగింది. ప్ర భుత్వం లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చే యాలని కోరడంతో జిల్లా రైతులు మొక్కజొన్నను తగ్గించి వరి వైపు మొగ్గారు. వరిలో దొడ్డు రకాలను తగ్గించి సన్న రకాలను సాగు చేశారు. 


2.45 లక్షల ఎకరాలలో సన్నాల సాగు 

జిల్లాలో ఈ వానాకాలంలో మొత్తం 3 లక్షల 80 వేల ఎక రాలలో రైతులు వరి పంటను సాగుచేశారు. ఇందులో వ్య వసాయ అధికారులు క్లస్ట్టర్ల వారీగా తీసిన లెక్కల ప్రకారం 2 లక్షల 45 వేల ఎకరాలలో సన్న రకాలను సాగు చేశారు. గత సంవత్సరం వానాకాలంలో వరి 2 లక్షల 80 వేల ఎకరా లలో సాగైంది. సన్నరకాలను లక్ష ఎకరాలలో మాత్రమే సా గు చేశారు. ఈ సంవత్సరం వానాకాలంలో గణనీయంగా పె ంచారు. గత సంవత్సరం కంటే లక్షన్నర ఎకరాలు ఎక్కువగా సాగు చేశారు. జిల్లాలో దొడ్డు రకాలను తగ్గించాలని వ్యవ సాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగా హన కల్పించడంతో సన్న రకాల సాగు ఎక్కువైంది. జిల్లాలో సన్నరకాలలో బీపీటీ, గంగా కావేరి, హెచ్‌ఎంటీతో పాటు ఇతర రకాలను సాగు చేశారు. 


ధర వస్తుందని రైతుల్లో ఆశ

జిల్లాలో సన్న రకాల సాగు పెరగడం వల్ల రైతులు తమ కు ధర వస్తుందని భావిస్తున్నారు. కేంద్రం పెంచిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడుకు క్వింటాలు 1,867 రూపాయలు, బీ గ్రేడుకు క్వింటాలుకు 1,847 రూపాయలు ఉంది. జిల్లాలో సన్న రకాల సాగు పెరిగినా ఇవి బీ గ్రేడు కిందకు వస్తాయి. దొడ్డు రకాలు మాత్రమే ఏ గ్రేడు కిందకు వస్తాయి. రైతులు సన్న రకాలకు ఈ దఫా ఎక్కవ ధరను ఆశిస్తున్నారు. సన్న బియ్యం బహిరంగ మార్కెట్‌లో కిలో 40 రూపాయల వర కు ఉన్నాయి. కొన్ని రకాలు అంతకు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఈ సన్న రకాలను ఎక్కువగా వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుం చి వచ్చి తీసుకెళుతున్నారు. రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు సన్న ర కాలు వేసిన తమకు మద్దతు ధరకు మించి ధర వచ్చే విధ ంగా చూడాలని రైతులు కోరుతున్నారు. సన్న రకాలను ఏ గ్రేడుకు మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సన్న రకా ల సాగుకు పెట్టుబడి పెరిగినందున ఎక్కువ ధర ఇవ్వాలని కోరుతున్నారు. 


కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

జిల్లాలో వరిసాగు పెరగడంతో అధికారులు ఇప్పటి నుం చే ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. ఈ వానాకాలం లో పది లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వ స్త్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల అధికా రులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొను గోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం లాగానే 355 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ని ర్ణయించారు. అక్టోబరు మొదటి వారం నుంచి జిల్లాలో ధా న్యం సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైన గన్నీ బ్యాగులను తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మళ్లీ వానాకాలం ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాటు చేస్తుండగా రబీలో మాదిరిగా కడ్తా, తూకంలో జరిగిన వ్య త్యాసంపై అధికారులు దృష్టి సారించారు. కొన్ని సొసైటీల ప రిధిలో రైతులు అమ్మిన ధాన్యానికి తక్కువ డబ్బులు వచ్చా యని సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు అందటంతో ద ర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-07T10:55:44+05:30 IST