వరి పైరును పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ రాష్ట్రస్థాయి అధికారులు
జలదంకి, ఫిబ్రవరి 26: మండలంలో శుక్రవారం వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారులు పర్యటించారు. జాతీయ ఆమార భద్రతా మిషన్ పథకము, పొలంబడి కార్యక్రమాలపై రాష్ట్ర అధికారులు గ్రామాల్లో పటం పొలాలను పరిశీలించారు. మండల వ్యవసాయాధికారిణి బి.శైలజ నేతృత్వంలో బ్రాహ్మణక్రాకలో శనగపంటను డీడీఏ జెడ్.వెంకటేశ్వర్లు, ఏవో సురే్‌షరెడ్డి పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం జలదంకిలో వరి రైతులతో పొలంబడికి ఎంపికైన వరి పొలాల్లో పర్యటించి పంటను పరిశీలించారు. మండల వ్యవసాయశాఖ సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఆర్‌బీకే వీఎఎలు ప్రియాంక, శివప్రియ పాల్గొన్నారు.