Advertisement

‘రైతు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లులు’

Sep 25 2020 @ 01:18AM

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 24 : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమైనవని పార్లమెం టు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కాగడాల ప్రదరిన ని ర్వహించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌ ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు ఉత్పత్తుల వర్త క, వాణిజ్యం (ప్రోత్సాహం సదుపాయాల కల్పన)బిల్లు, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు, నిత్యావసర ఉత్పత్తుల (సవరణ) బి ల్లులన్నీ కార్పొరేట్‌ శక్తులకు మేలు చేకూర్చేలా రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఈ బిల్లుతో రైతులకు అన్యాయం జరుగుతుంద న్నా రు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకువ చ్చిం దని తెలిపారు. కార్య్రమంలో జావేద్‌ అక్రమ్‌, రాష్ట్ర కార్యదర్శులు సుమ న్‌, విక్కీయాదవ్‌,భగత్‌, గోపి, ప్రీతం, కార్పొరేటర్‌ రోహిత్‌ పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement