‘త్రైపాక్షిక’ నిర్ణయం.. అమలు శూన్యం

ABN , First Publish Date - 2021-07-24T06:09:39+05:30 IST

పత్తి విత్తనోత్పత్తి రైతులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన త్రైపాక్షిక ఒప్పందాల నిర్ణ యం ప్రకటనలకే పరిమితమవుతోంది.

‘త్రైపాక్షిక’ నిర్ణయం.. అమలు శూన్యం
సీడ్‌ ఆర్గనైజర్లు, రైతులతో కలెక్టర్‌ సమావేశం (ఫైల్‌)

- సీడ్‌ పత్తి రైతులు నష్టపోకుండా ఉండేందుకే రక్షణగా త్రైపాక్షిక ఒప్పందాలు 

- ఈ ఏడాది మే నుంచి అమలు చేస్తామని ప్రకటించిన సర్కారు

- అమలు చేయకుండానే సాగు చేపట్టిన సీడ్‌ ఆర్గనైజర్లు

- ఒప్పందాలు చేసుకుంటే నష్టమని భావించడమే ఇందుకు కారణం

- పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం


గద్వాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : పత్తి విత్తనోత్పత్తి రైతులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించిన త్రైపాక్షిక ఒప్పందాల నిర్ణ యం ప్రకటనలకే పరిమితమవుతోంది. మే నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ మొదలు కాకపోవడంతో, జోగుళాంబ గద్వాల జిల్లాలోని సీడ్‌ పత్తి రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఈ ఒప్పందాలు అ మలైతే విత్తన కంపెనీలు, సీడ్‌ ఆర్గనైజర్ల అక్రమాలకు తెరపడనుంది.

జోగుళాంబ గద్వాల జిల్లా విత్తన పత్తికి పెట్టింది పేరు. దాదాపు మూ డు దశాబ్దాలుగా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. కంపెనీలు ఇ చ్చే ఫౌండేషన్‌ సీడ్‌ను ఆర్గనైజర్ల ద్వారా పొందే రైతులు, పంట పండిన తరువాత వారికే విక్రయిస్తారు. వారు వాటిని విత్తనాలుగా వేరు చేసి, డీ లింటింగ్‌ చేసి విత్తన కంపెనీలకు పంపిస్తారు. జీవోటీ (గ్రో ఔట్‌ టెస్ట్‌)లో పాసైతే, ఆ విత్తనాలకు కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయి. ఫెయిల్‌ అయిన విత్తనాలను కంపెనీలు ఆర్గనైజర్లకు, వారి నుంచి రైతులకు రిటర్న్‌ చేస్తా యి. ఒకవేళ విత్తనాలు ఫెయిల్‌ అయితే ఆ సంవత్సరం రైతు పంటంతా నష్టపోయినట్లే లెక్క. ఇదీ సాధారణంగా జరిగే ప్రక్రియ. 

అయితే, అటు సీడ్‌ కంపెనీలను, ఇటు రైతులను చెరబట్టిన ఆర్గనైజర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. కంపెనీలు ఇచ్చే పెట్టుబడిపై వడ్డీ శాతం పెంచడం, కంపెనీలు ఇచ్చే ధరను తగ్గించి ఇవ్వడం, విత్తనాలు ఫెయిల్‌ కాకున్నా ఫెయిల్‌ అయినట్లు చెప్పడం, కంపెనీలు డబ్బులు ఇచ్చినా రై తులకు ఇవ్వకుండా వారి డబ్బులే వారికి ఉల్టా ఇవ్వడం వంటివి చేస్తూ, రైతులకు నష్టం కలిగిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి రైతుల వద్ద ఎలాంటి రక్షణ వ్యవస్థ లేదు. సీడ్‌ ఆర్గనైజర్లు చెప్పినట్లు నడుచుకోవడం తప్ప, చేసేదేమీ ఉండదు. దీంతో ఏళ్లుగా చాలా మంది పోరాటాలు చేస్తు న్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వ్యవసాయ శాఖ కంపెనీ, ఆర్గనైజర్‌, రైతుల మధ్యలో కచ్చితంగా త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకో వాల్సిందేనని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూమి వివరాలు, విత్తనా ల వివరాలు, ధరలు, పెట్టుబడి తదితర అంశాలు పొందుపర్చి, మూడు పార్టీలు సంతకం చేసి, స్థానిక వ్యవసాయాధికారికి అందజేయాలి. అలాగే రైతులు తమ వద్ద ఒప్పంద పత్రాల కాపీలను భద్రపర్చుకోవాలి. ఒప్పం దాల్లో పేర్కొనట్లుగా చేయకపోతే రైతులు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అ లాగే తమ పంట, తమ లాభం, తమ నష్టంపై పూర్తిస్థాయి భరోసా రై తుకు ఏర్పడుతుంది.


అమలుకు నోచుకోని నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు తెలంగాణను సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మా రుస్తామని ప్రకటనలు జారీ చేసింది. కానీ, జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో మూడు దశాబ్దాలుగా సీడ్‌ పత్తి సాగు చేస్తున్న రైతులకు సరైన న్యాయం చే యడంలో విఫలమవుతూనే ఉంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ త్రైపాక్షిక ఒ ప్పందాలేనని చెప్పాల్సి వస్తోంది. జిల్లాలో ఏటా దాదాపు 30 నుంచి 40 వేల ఎ కరాల్లో 40 వేల మంది రైతులు సీడ్‌ పత్తి సాగును చేపడుతున్నారు. ఏళ్లుగా రై తులను దోచుకోవడానికి అలవాటుపడిన ఆర్గనైజర్లు ఈ నిర్ణయాన్ని అమలు చే యడానికి ససేమిరా అంటున్నారు. ఎందుకంటే, ఇందులో ఉన్న అక్రమ వ్యవహా రాలు, ఆదాయ పన్ను ఎగవేత వంటివి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గతంలో సీఎం కేసీఆర్‌ కూడా జిల్లాలో సీడ్‌ పత్తి సాగు చేపట్టే రైతులు నష్టపోకుండా ఉండేందుకు కంపెనీలతో ఒప్పందాలు చేయించాలని సూచించారు.. అదీ అమ లుకు నోచుకోలేదు. అలాగే రైతు సంఘాలు, నడిగడ్డ రైతు హక్కుల పోరాట స మితి ఆధ్వర్యంలో నిరసనలు తెలపడం, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో గతంలో కలెక్టర్‌గా ఉన్న శశాంక, ఆ తర్వాత కలెక్టర్‌గా వచ్చిన శ్రుతి ఓఝా ఆర్గనైజర్లతో సమావేశాలు నిర్వహించడంతోపాటు రైతులకు న్యా యం చేయాలని సూచించారు. అందుకు సమవేశాల్లో అంగీకరిస్తున్న ఆర్గనై జర్లు, తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ కీలక నిర్ణ యాన్ని అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.

Updated Date - 2021-07-24T06:09:39+05:30 IST