వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలి

ABN , First Publish Date - 2020-12-02T04:50:26+05:30 IST

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు చట్టబద్దంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత రైతుసంఘాల పోరాటసమన్వయకమిటీ ఆధ్వర్యంలో డిల్లీ రైతుపోరాటానికి మద్దతుగా 3న దేశవ్యాప్తంగా జరిగే రైతు నిరసనలో భాగంగా రాస్తారోకోలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలి
మాట్లాడుతున్న పోతినేని సుదర్శన్‌రావు

 సీపీఎం నాయకులు పోతినేని, నున్నా

వైరా, డిసెంబరు 1: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు చట్టబద్దంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత రైతుసంఘాల పోరాటసమన్వయకమిటీ ఆధ్వర్యంలో డిల్లీ రైతుపోరాటానికి మద్దతుగా 3న దేశవ్యాప్తంగా జరిగే రైతు నిరసనలో భాగంగా రాస్తారోకోలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్‌లో జరిగిన సీపీఎం రూరల్‌మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యుడు బొంతు రాంబాబు, నాయకులు తోట నాగేశ్వరరావు, పారుపల్లి కృష్ణారావు, తూము సుధాకర్‌, మాగంటి తిరుమలరావు, బాజోజు రమణ, ద్రోణాదుల నాగేశ్వరరావు, నలమల కోటేశ్వరరావు, మజీద్‌ పాల్గొన్నారు.

ముదిగొండ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతువ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా మంగళవారం స్థానిక ప్రధాన సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు కందుల భాస్కర్‌రావు, కోలేటి ఉపేందర్‌, భద్రయ్య, మంకెన దామోదర్‌, మందరపు వెంకన్న, శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.

బోనకల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విదానాలను అవలంబిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు ఆరోపించారు. సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఎంపీటీసీ జొన్నలగడ్డ సునిత అద్యక్షతన జరిగిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే వారిపై లాఠీ చార్జి చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చింతలచెర్వు కోటేశ్వరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు, నాయకులు గుగులోతు పంతు, బందం శ్రీను, ఉమ్మినేని రవి, తెల్లాకుల శ్రీనివాసరావు, గుగులోతు నరేష్‌, మర్రి తిరుపతిరావు, గుగులోతు శారద పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T04:50:26+05:30 IST