దిగు(లు)బడి

ABN , First Publish Date - 2021-02-27T04:05:35+05:30 IST

పండ్ల రకాలలో మామిడికి ఫలరాజంగా పే రుంది.

దిగు(లు)బడి
బూడిద తెగులు సోకడంతో నల్లగా మారిన పూత

- వాతావరణంలో మార్పులు

- మామిడి తోటలకు ఆశించిన బూడిద తెగులు, తేనె మంచు

- నేల రాలుతున్న పూతతో దిగులు


కొల్లాపూర్‌, ఫిబ్రవరి 26 : పండ్ల రకాలలో మామిడికి ఫలరాజంగా పే రుంది. అందులో కొల్లాపూర్‌కు చెందిన మామిడికి దేశ, విదేశాల్లోనే మం చి డిమాండ్‌ ఉంది. అయితే, ఈసారి కొల్లాపూర్‌ మామిడి పండ్లను ప్రజ లు తనివితీరా తినే పరిస్థితి లేకుండాపోతుంది. తెగుళ్లతో పూత రాలిపో తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


రైతులకు మళ్లీ నష్టాలు

తెలంగాణలో మామిడి తోటలకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ ని యోజకవర్గం ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా వ్యాప్తంగా 26,016 ఎకరాల్లో తో టలు ఉండగా, ఒక్క కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే 15,968 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం నాటి నుంచి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు, 30 ఏళ్లుగా ఎన్న డూ లేనంతగా మామిడి చెట్లకు పూత విరగబూసింది. దీంతో పంట దిగు బడులపై రైతుల్లో ఆశలు పెరిగాయి. అయితే, అనుకోని విధంగా వాతావ రణంలో మార్పులు వచ్చాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి తో టలకు బూడిద తెగులు, తేనెమంచు వ్యాపించడంతో రోజుల వ్యవధిలోనే చెట్లకున్న పూత నేలరాలిపోయింది. మందులు వాడినా, ఫెస్టిసైడ్స్‌ పిచికా రి చేసినా ఫలితం లేకుండా పోయింది. గతేడాది కరోనా వ్యాప్తితో వచ్చిన దిగుబడులను కూడా అమ్ముకోలేకపోయిన రైతులకు, ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పూతతోపాటు పిందె, పళ్లు వస్తాయని ఆశించినా నష్టాలే ఎదురవుతున్నాయి.


పెట్టుబడులు కూడా వచ్చేది కష్టం

జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాలో ఎనిమిది వేల మంది రైతు లు మామిడి తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో 2,223ఎ కరాలు, కల్వకుర్తి నియోజకవర్గంలో 3,453 ఎకరాలు, అచ్చంపేట నియోజకవర్గంలో 4,372 ఎకరాలు, కొల్లాపూర్‌లో 15,968 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి దిగుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ప్రకృతి వై పరీత్యంతో తోటల్లోనే పూత రాలిపోవడంతో ఈ ఏడాది కనీసం పెట్టుబడు లు కూడా చేతికందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-02-27T04:05:35+05:30 IST