వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T04:25:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఇప్ట్యూ జిల్లా కార్యదర్శి నరసింహులు డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

నారాయణపేట టౌన్‌/ మక్తల్‌/ ఊట్కూర్‌, డిసెంబరు 3 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఇప్ట్యూ జిల్లా కార్యదర్శి నరసింహులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై దమన కాండను నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ ఆటో స్టాండ్‌ వద్ద ఇప్ట్యూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకు లు నరసింహ, మల్లేష్‌, బాలప్ప, నయ్యూం, రాజు పాల్గొన్నారు. మక్తల్‌ కేఎన్‌పీ ఎస్‌ నాయకులు తహసీల్దార్‌ నర్సింగరావుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కేఎన్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కేఎన్‌పీఎస్‌ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు బండారి నర్సప్ప, నాయకులు నర్సింగప్ప, హన్మంతు, బస్వరాజ్‌, శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, హన్మంతు పాల్గొన్నారు. ఊట్కూర్‌, పెద్దపొర్ల గ్రామాల్లో ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నప్ప, సహాయ కార్యదర్శి కనకరాయుడు, పెద్దపొర్లలో ఐఎఫ్‌టీయు జిల్లా అధ్యక్షుడు కిరణ్‌, పీవై ఎల్‌ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్‌, జిల్లా నాయకులు ఆంజనేయులు, కృష్ణ, కిష్టప్ప, తిప్పయ్య, నర్సిములు, గ్రామ నాయకులు కొండగట్టు చిన్నబాలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:25:53+05:30 IST