వ్యవసాయ చట్టాల రద్దుతోనే రైతులకు న్యాయం

ABN , First Publish Date - 2021-01-17T04:55:02+05:30 IST

కేంద్రం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తేనే వారికి న్యాయం జరగుతుందని, కమిటీతో ప్రయోజనం శూన్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.

వ్యవసాయ చట్టాల రద్దుతోనే రైతులకు న్యాయం

 సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు 

పెరిదేపి (కొండపి), జనవరి 16: కేంద్రం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తేనే వారికి న్యాయం జరగుతుందని, కమిటీతో ప్రయోజనం శూన్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. శనివారం పెరిదేపి గ్రామానికి వచ్చిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇషా ్టగోష్టిగా మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌లకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా.. చర్చలు జరుపుతూ కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు.  కమిటీ ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉం డాలని అన్నారు. ఏకపక్ష కమిటీలతో రైతలకు కలిగే ఉపయోగమేమీ లేదని రాఘవులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన చట్టాలను ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

అనంతరం గ్రామంలో అనారోగ్యం తో బాధపడుతున్న సీపీఎం నాయకు డు కాలే చెంచయ్యను పరామర్శిం చారు. ఆయన వెంట సీపీఎం సీని యర్‌ నాయకుడు ముప్పరాజు కో టయ్య, మండల కార్యదర్శి కేజీ మస్తాన్‌, ముప్పరాజు చినబ్రహ్మయ్య,  గుమ్మళ్ల వెంకటేశ్వర్లు, రావిపాటి చౌదరి తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-01-17T04:55:02+05:30 IST