సంక్షోభంలో వ్యవసాయం

ABN , First Publish Date - 2022-05-19T06:45:13+05:30 IST

ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఫలితంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు.

సంక్షోభంలో వ్యవసాయం
రైతు సభలో మాట్లాడుతున్న కేశవరావు

ఏలూరు టూటౌన్‌, మే 18: ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఫలితంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. ఏలూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో రైతు సంఘం మహాసభ బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లా డుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించలేకపోతోందని, పంటలకు కనీస ధరలు రాకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టాలని కేంద్రం కుట్రలు కొనసాగుతున్నాయన్నా రు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతు లను ఆదుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తు న్నాయన్నారు. రైతాంగ సమస్యలపై సమరశీల పోరా టాలకు రైతులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు జీవీ కృష్ణారావు, ఎం.నరసింహ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజనేయులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చింతకాయల బాబూరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T06:45:13+05:30 IST