కలగా.. కల్లాలు

ABN , First Publish Date - 2020-12-04T03:50:34+05:30 IST

రాష్ట్రం లో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరు గుతోంది.

కలగా.. కల్లాలు
పెద్దమందడి మండలం బలిజపల్లి వద్ద రోడ్డుపైనే ఆరబోసుకున్న ధాన్యం

- కల్లాల నిర్మాణంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకంజ

- అవగాహన లేక ముందుకు సాగని ప్రక్రియ

- 12,700 నిర్మాణాలకు గాను ఒక్క నిర్మాణమే పూర్తి

- సాముహిక కల్లాల నిర్మాణంపై సర్కారు దృష్టి


వనపర్తి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం లో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరు గుతోంది. అందులో వరి సాగు విస్తీర్ణంలో గణనీయ మైన వృద్ధి కనిపిస్తోంది. దీంతో భారీ స్థాయిలో వ చ్చే ధాన్యాన్ని ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకురా వాలంటే రైతులకు కష్టతరం అవుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టుకునే వెసులుబాటు పూర్తిస్థా యిలో లేకపోవడంతో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అలాగే పలు ఆరుతడి పంటలకు సంబంధించిన నూర్పిడి పనులు కూడా రోడ్లపైనే చేస్తుండటంతో తరచూ రో డ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందుల ను దూరం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆ ర్‌ఈజీఎస్‌లో భాగంగా ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడం, మెటీరియల్‌ కంపొనెంట్‌ నిధుల ను కల్లాల కోసం వెచ్చించడం ద్వారా కల్లాల నిర్మా ణం చేయాలని భావించింది. జాబ్‌కార్డు ఉన్న రైతు ల్లో ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఓసీ, బీసీ రైతుల కు 90 శాతం నిధులు ఇవ్వాలని సంకల్పించింది. మొత్తం మూడు రకాల డిజైన్లను ఆమోదించగా, 50 చదరపు మీటర్ల వైశాల్యంతో నిర్మించుకునే కల్లా నికి రూ.68 వేలు, 60 చ.మీ. వైశాల్యంతో నిర్మించు కునే కల్లానికి రూ.75 వేలు, 75 చ.మీ. వైశాల్యంతో నిర్మించుకునే కల్లానికి రూ.85 వేలను మంజూరు చేయనుంది. కల్లం నిర్మించుకోవాలనుకునే రైతులు వ్యవసాయ అధికారులకు కానీ, పంచాయతీ కార్యద ర్శికి కానీ దరఖాస్తు అందజేయాలి. వారు డీఆర్‌డీఓ కు దరఖాస్తు పంపిన తర్వాత ఏపీఓ వాటిని పరిశీ లించి కల్లం మంజూరు చేస్తారు. ఒక వేళ సొంత ఖర్చుతో కల్లం నిర్మించుకుంటే టెక్నికల్‌ అసిస్టెంట్లు మెజర్‌మెంట్‌ బుక్‌లో రికార్డు చేసి, డబ్బులను సద రు రైతు ఖాతాలో జమ చేస్తారు. అయితే, కల్లాల నిర్మాణంపై రైతులకు అవగాహ న లేకపోవడంతో చాలా మంది దరఖాస్తులు చేసు కోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సామూహి క కల్లాల నిర్మాణానికి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వ్య వసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.


ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇదీ పరిస్థితి


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి అధికారులు 13,125 కల్లాల నిర్మాణానికి రూ.111.78 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఇందులో 12,700 కల్లాలకు రూ.96.09 కోట్లకు ప్రభుత్వ మంజూరు లభించింది. జూన్‌లో ఈ పథకాన్ని ప్రా రంభించగా, ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిర్మాణాల పరిస్థితి దాపు రించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3,081 కల్లాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, రూ.23.55 కో ట్లతో 3,056 కల్లాల నిర్మాణానికి మంజూరు లభిం చింది. ఇందులో 252 కల్లాల నిర్మాణ పనులు ప్రా రంభించగా రూ.17,48 లక్షలు ఖర్చు చేశారు. ఇప్ప టి వరకు ఒక్క కల్లం కూడా పూర్తి కాలేదు. వనప ర్తి జిల్లాలో 1,848 కల్లాల నిర్మాణానికి ప్రతిపాదన లు పంపగా, రూ.14.26 కోట్లతో 1,779 కల్లాలు మం జూరయ్యాయి. ఇందులో 18 పనులు ప్రారంభించి రూ.4.09 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు ఒక్క కల్లం కూడా పూర్తి కాలేదు. జోగుళాంబ గద్వాల జి ల్లాలో 1,549 కల్లాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, 1,493 కల్లాల నిర్మాణానికి రూ.11.39 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 35 పనులు ప్రా రంభించగా, రూ.4.86 లక్షలు ఖర్చు చేశారు. ఒక్క కల్లం నిర్మాణ మాత్రమే పూర్తయ్యింది. నాగర్‌కర్నూ ల్‌ జిల్లాలో 4,367 కల్లాల నిర్మాణానికి ప్రతిపాద నలు పంపగా, రూ.32.23 కోట్లతో 4,324 కల్లాలు మంజూరయ్యాయి. 107 పనులు ప్రారంభించి రూ.13.57 లక్షలు ఖర్చు చేయగా, ఇప్పటి వరకు ఒ క్క కల్లం కూడా పూర్తి కాలేదు. నారాయణపేట జి ల్లాలో 2,280 కల్లాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించగా, రూ.15.47 కోట్లతో 2,048 కల్లాలు మం జూరయ్యాయి. ఇప్పటి వరకు 41 కల్లాల నిర్మాణ పనులు ప్రారంభించగా, రూ.4.76 లక్షలు ఖర్చు చే శారు. ఇక్కడ కూడా ఇప్పటి వరకు ఒక్క కల్లం కూ డా పూర్తి కాలేదు. కల్లాల నిర్మాణంలో వేగం పెంచి వచ్చే సీజన్‌ నాటికైనా పూర్తి చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-12-04T03:50:34+05:30 IST