ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఆగ్రో ప్రోసెసింగ్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2022-05-29T06:17:32+05:30 IST

అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌)లో ఆగ్రో ప్రోసెసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ పీవీకే జగన్నాథరావు తెలిపారు.

ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఆగ్రో ప్రోసెసింగ్‌ సెంటర్‌
అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఆగ్రో ప్రోసెసింగ్‌ సెంటర్‌


ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ జగన్నాథరావు

అనకాపల్లి అగ్రికల్చర్‌, మే 28: అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌)లో ఆగ్రో ప్రోసెసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ పీవీకే జగన్నాథరావు తెలిపారు. ఈ సెంటర్‌లో మినీ రైస్‌ మిల్లుతోపాటు అపరాలు, చిరుధాన్యాల పొట్టుతీసే మినీ మిల్లులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఉసిరి, అల్లంసోప్‌పై బెల్లం పూతవేసే యంత్రాన్ని ఏర్పాటుచేసినట్టు ఆయన చెప్పారు. బెల్లం తేనె శుద్ధిచేసే యంత్రాన్ని, బంగాలదుంపల చిప్స్‌ మిషన్‌, మినీ ఆయిల్‌ మిల్లు, జీడిపప్పు, బాదం పప్పులను చిన్న ముక్కలుగా తరిగే యంత్రాన్ని, బిస్కెట్‌లు, నూడిల్స్‌, కేక్‌లు, చపాతి పిండి కలిపే యంత్రాన్ని పంట గింజలను శుద్ధి చేసే యూనిట్‌ కేంద్రం లో ఉన్నాయన్నారు. రైతులకు ఆగ్రో ప్రోసెసింగ్‌ పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఆగ్రో ప్రోసెసింగ్‌ సెంటర్‌లు అనకాపల్లి, బాట్లలో మాత్రమే ఉన్నాయని, చిరు ధాన్యాల ప్రోసెసింగ్‌ కేంద్రం తిరుపతిలో ఉందని ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.భరత్‌లక్ష్మి తెలిపారు.


Updated Date - 2022-05-29T06:17:32+05:30 IST