కాంగ్రెస్ ముందు జాగ్రత్త.. హోటల్‌కు అభ్యర్థులు

ABN , First Publish Date - 2022-03-09T00:51:18+05:30 IST

ఈ నెల 10న అసెంబ్లీ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గోవా కాంగ్రెస్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తమ పార్టీ అభ్యర్థుల్ని హోటల్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తోంది.

కాంగ్రెస్ ముందు జాగ్రత్త.. హోటల్‌కు అభ్యర్థులు

ఈ నెల 10న అసెంబ్లీ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గోవా కాంగ్రెస్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తమ పార్టీ అభ్యర్థుల్ని హోటల్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు హోటల్‌లోనే ఉంటారు. అక్కడి నుంచి గురువారం నేరుగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ ఫలితాల తర్వాత జరిగిన పరిణామాల్ని ద‌ృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకుంది. అయితే, గెలుపొందినవాళ్లలో ఎక్కువమంది బీజేపీతో చేరిపోవడంతో కాంగ్రెస్ మెజార్టీ రెండుకు పడిపోయింది. దీంతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకునే అవకాశం కోల్పోయింది. అందుకే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకూడదని ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. పైగా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి మెజార్టీ సాధించే అవకాశాలున్నాయని ఎగ్జిట్‌పోల్స్‌లో తేలడంతో మరింత జాగ్రత్త పడుతోంది. మరోవైపు బీజేపీ కూడా తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు పనాజీలోని పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించింది.

Updated Date - 2022-03-09T00:51:18+05:30 IST