ప్రేక్షకుల ముందుకు 2023లోనే?

Jun 10 2021 @ 00:39AM

తమిళ హీరో విజయ్‌తో దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 2023లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని కోలీవుడ్‌ ఖబర్‌. ప్రస్తుతం దిలీప్‌ నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమా చేస్తున్నారు. అందులో పూజా హెగ్డే హీరోయిన్‌. ఆ సినిమా తర్వాత ‘మాస్టర్‌’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో మరో సినిమా చేయడానికి విజయ్‌ అంగీకరించారు. ఆ రెండిటి తర్వాత వంశీ పైడిపల్లి సినిమా మొదలవుతుందట. వచ్చే ఏడాది సినిమా చిత్రీకరణకు వెళ్లినా... 2023 సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల చేసేలా నిర్మాత ‘దిల్‌’ రాజు ప్లాన్‌ చేస్తున్నారట.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.