Ahmedabad విమానాశ్రయం రోజుకు 9గంటలపాటు మూసివేత..52 విమాన సర్వీసుల రీ షెడ్యూల్

ABN , First Publish Date - 2022-01-17T16:07:03+05:30 IST

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే రీ కార్పెటింగ్ పనుల కారణంగా ఈ ఏడాది మే 31వతేదీ వరకు రోజుకు 9 గంటల పాటు విమానాశ్రయాన్ని...

Ahmedabad విమానాశ్రయం రోజుకు 9గంటలపాటు మూసివేత..52 విమాన సర్వీసుల రీ షెడ్యూల్

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే రీ కార్పెటింగ్ పనుల కారణంగా ఈ ఏడాది మే 31వతేదీ వరకు రోజుకు 9 గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేయనున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. దీనివల్ల అహ్మదాబాద్ నుంచి బయలుదేరే 52 విమాన సర్వీసులను రీ షెడ్యూల్ చేశారు. రన్ వే పై రీ కార్పెటింగ్ పనుల వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా విమానాల షెడ్యూల్ ను మార్చామని అధికారులు చెప్పారు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో తాజాగా 10,150 కరోనా కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2022-01-17T16:07:03+05:30 IST