Ahmedabad: రోడ్‌సైడ్ మాంసాహార స్టాల్స్‌‌పై మున్సిపాలిటీ నిషేధాస్త్రం

ABN , First Publish Date - 2021-11-16T13:06:11+05:30 IST

అహ్మదాబాద్‌లో మంగళవారం నుంచి మాంసాహారం విక్రయించే రోడ్‌సైడ్ స్టాల్స్‌ను మున్సిపల్ కార్పొరేషన్ నిషేధించింది...

Ahmedabad: రోడ్‌సైడ్ మాంసాహార స్టాల్స్‌‌పై మున్సిపాలిటీ నిషేధాస్త్రం

అహ్మదాబాద్ : అహ్మదాబాద్‌లో మంగళవారం నుంచి మాంసాహారం విక్రయించే రోడ్‌సైడ్ స్టాల్స్‌ను మున్సిపల్ కార్పొరేషన్ నిషేధించింది. రోడ్ల వెంట,పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనామందిరాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న మాంసాహారం విక్రయించే స్టాల్స్ అనుమతించబడవని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కమిటీ నిర్ణయించింది. మంగళవారం నుంచి మాంసాహారం విక్రయించే రోడ్‌సైడ్ స్టాల్స్‌ను మూసివేస్తున్నామని అహ్మదాబాద్ సీనియర్ టౌన్ ప్లానింగ్ అధికారి దేవాంగ్ డానీ  తెలిపారు.


రోడ్ల పక్కన మాంసాహారం విక్రయించడంపై నగర ప్రజలు చేసిన ఫిర్యాదులపై టౌన్ ప్లానింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని దేవాంగ్ చెప్పారు. ప్రజలు శాకాహారమైనా, మాంసాహారమైనా తినేందుకు స్వేచ్ఛ ఉందని, కాని రోడ్డు పక్కన స్టాళ్లలో విక్రయించే మాంసాహారం హానికరం కాకూడదని, స్టాల్స్ వల్ల ట్రాఫిక్ కు అంతరాయం వాటిల్ల కూడదని తాము వీటిని నిషేధించామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చెప్పారు. 


Updated Date - 2021-11-16T13:06:11+05:30 IST