గోశాల‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్‌... బాధితుల‌కు గోమూత్రం పంపిణీ!

ABN , First Publish Date - 2021-05-09T16:54:49+05:30 IST

గుజరాత్‌లోని ఒక గోశాల‌లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి...

గోశాల‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్‌... బాధితుల‌కు గోమూత్రం పంపిణీ!

అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఒక గోశాల‌లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి, బాధితుల‌కు ఆయుర్వేద ఔష‌ధాలు అంద‌జేస్తున్నారు. బనస్కాంత జిల్లాలో గ‌ల‌ ఈ కేంద్రంలో ఉంటున్న క‌రోనా బాధితుల‌కు ఆవు పాలు, ఆవు మూత్రంతో త‌యారు చేసిన ఔష‌ధాల‌ను ఇచ్చి, చికిత్స చేస్తున్నారు. తేలికపాటి లక్ష‌ణాలు క‌లిగిన క‌రోనా బాధితుల‌కు ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. 


ఈ  కోవిడ్ సెంటర్‌కు వేదలక్షణ పంచగవ్య‌ ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఏడుగురు బాధితులు ఈ సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సంద‌ర్భంగా గోశాల ట్ర‌స్టీ మోహన్ జాదవ్ మాట్లాడుతూ క‌రోనా పాజిటివ్ బాధితుల‌ను ఈ సెంట‌ర్‌లో చేర్చుకుంటున్నట్లు తెలిపారు. తాము మే 5 న ఈ కేంద్రాన్ని ప్రారంభించామ‌ని, ప్ర‌స్తుతం ఏడుగురు బాధితులు ఇక్క‌డ చికిత్స పొందుతున్నార‌ని, ఎనిమిది ర‌కాల ఆయుర్వేద మందులతో వారికి చికిత్స చేస్తున్నామని తెలిపారు. ఈ ఔష‌ధాల‌ను ఆవు పాలు, నెయ్యి, ఆవు మూత్రాల‌ను వినియోగించి త‌యారు చేస్తున్నామ‌న్నారు. 

Updated Date - 2021-05-09T16:54:49+05:30 IST