AIADMK Tussle : మద్రాస్ హైకోర్ట్ కీలక తీర్పు.. OPS కి ఎదురుదెబ్బ.. తాత్కాలిక జనరల్ సెక్రటరీగా EPS

ABN , First Publish Date - 2022-07-11T16:41:01+05:30 IST

ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్ సెల్వానికి(ఓపీఎస్) ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినాయకత్వాన్ని నిర్ణయించేందుకు కీలకమైన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్‌కు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AIADMK Tussle : మద్రాస్ హైకోర్ట్ కీలక తీర్పు.. OPS కి ఎదురుదెబ్బ.. తాత్కాలిక జనరల్ సెక్రటరీగా EPS

చెన్నై : ఏఐఏడీఎంకే(AIADMK) అంతర్గత జరగడంలో ఆ పార్టీ కీలక నేత ఓ పన్నీర్ సెల్వానికి(OPS) ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినాయకత్వాన్ని నిర్ణయించేందుకు తలపెట్టిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్‌కు మద్రాస్ హైకోర్ట్(Madras High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎడప్పాటి పళనిస్వామి(EPS) సారధ్యంలో పార్టీ జనరల్ సెక్రటరీ సమావేశంపై స్టే విధించాలంటూ ఓపీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్ట్ తోసిపుచ్చింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్ట్ సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కీలక తీర్పునిచ్చింది. 


తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళని స్వామి ఎన్నిక

మద్రాస్ హైకోర్ట్తీ ర్పు నేపథ్యంలో సోమవారం ఉదయం 9:15 నిమిషాలకు ఏఐఏడీఎంకే  ప్రిసీడియం చైర్మన్ ఏ తమిళ్ మహన్ హుసేన్ నేతృత్వంలో జనరల్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశంలో పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళని స్వామి ఎన్నికయ్యారు. ఏకంగా 2500 మంది మద్దతు పళనిస్వామికి మద్దతు తెలిపారు. దీంతో పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి ముగింపు పడినట్టయ్యింది. ఇకపై పళని స్వామి ఒక్కరే పార్టీ అధినేతగా ముందుకు నడిపించనున్నారు.


నిబంధనల ప్రకారం.. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్‌లు సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా కొత్తగా ఎన్నికైన ప్రిసీడియం చైర్మన్ ఈ సమావేశాన్ని నిర్వహించడం చట్టవిరుద్ధమని పన్నీర్ సెల్వం వర్గం చెబుతోంది. ఈ వాదనపై ఈపీఎస్ వర్గం వాదన మరోలా ఉంది. పార్టీ నాయకత్వంపై రెండు వర్గాల మధ్య పోటీ నెలకొనడంతో ప్రిసీడియం చైర్మన్ సమావేశాన్ని నిర్వహించారని సమర్థించుకుంటున్నారు. ఇదే విధానంలో 2017లో పన్నీర్ సెల్వం పార్టీ అధినేతగా ఎన్నికయ్యారని గుర్తుచేస్తున్నారు. 


కాగా పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీని చట్టప్రకారం నిర్వహించేందుకు సుప్రీంకోర్ట్ గతవారమే అనుమతిచ్చింది. పార్టీలో ఏక నాయకత్వం ఉండాలని ఈపీఎస్ కోరుతుండగా, ద్వంద్వ నాయకత్వం ఉండాలని పన్నీర్ సెల్వం చెబుతూ వస్తున్నారు. 


కాగా కీలకమైన కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్‌ పదవుల కోసం ఓపీఎన్ వర్గం పోటీపడిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-07-11T16:41:01+05:30 IST