Delhi: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అరెస్టు

ABN , First Publish Date - 2022-07-21T20:21:06+05:30 IST

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ (Sampath)ను ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్టు చేశారు.

Delhi: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అరెస్టు

ఢిల్లీ (Delhi): ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ (Sampath)ను ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 ఏళ్లు బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల సీబీఐ (CBI), ఈడీ (ED) ఉపయోగించి వ్యతిరేక వాక్కు వినపడకుండా నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case) తిరగదోడడం కుట్రలో భాగమన్నారు. 2015లోనే సుప్రీంకోర్టు (Supreme court) కేసును పక్కకు పెట్టిందని, ఎన్నికల కమిషన్ (EC) కూడా కేసును కొట్టివేసిందన్నారు. నేషనల్ ఇరాల్డ్ కేసులో ఎలాంటి మనీ లాండరింగ్ (Money laundering) జరగలేదని కేసును కూడా పక్కకు పెట్టారన్నారు. ఇప్పుడు కావాలనే కేసును తిరగదోడి ఈడీ అధికారులు రాత్రికి రాత్రే మళ్లీ కాంగ్రెస్ (Congress) నేతలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ కార్యాలయం ముందు మమ్మల్ని అరెస్టు చేయడం.. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని సంపత్ వ్యాఖ్యానించారు.


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ (Enforcement Directorate) అధికారుల ముందు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద ఆమె వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. 

Updated Date - 2022-07-21T20:21:06+05:30 IST