ఎయిడెడ్‌ సీన్‌.. రివర్స్‌!

ABN , First Publish Date - 2021-11-17T05:23:32+05:30 IST

జిల్లాలో ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల విలీన వ్యవహారం రివ ర్స్‌ అయింది. ప్రభుత్వ ఎయిడెడ్‌ విద్యాసంస్థల విష యంలో అనుసరిస్తున్న విఽధానాలపై ఇప్పటికే విమర్శ లు వెల్లువెత్తున్నాయి.

ఎయిడెడ్‌ సీన్‌.. రివర్స్‌!

తొలుత 270 ఎయిడెడ్‌ పాఠశాలల అంగీకార లేఖలు

ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం

పాఠశాలలకు నాలుగు ఆప్షన్లు

తామిచ్చిన లేఖలను వెనక్కు తీసుకుంటున్న పాఠశాలలు

వెనక్కు వచ్చేందుకు పలువురు ఉపాధ్యాయులు సంసిద్ధత!


 జిల్లాలో ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలల 365

 సిబ్బందిని అప్పగిస్తూ లేఖలు ఇచ్చిన పాఠశాలలు 270

 అసలు లేఖలే ఇవ్వకుండా న్యాయపోరాటం చేస్తున్న పాఠశాలలు....95

 విలీన లేఖల్ని వెనక్కి తీసుకున్న పాఠశాలల సంఖ్య 195

 ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది 750 మంది

 

గుంటూరు (విద్య), నవంబరు 16: జిల్లాలో ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల విలీన వ్యవహారం రివ ర్స్‌ అయింది. ప్రభుత్వ ఎయిడెడ్‌ విద్యాసంస్థల విష యంలో అనుసరిస్తున్న విఽధానాలపై ఇప్పటికే విమర్శ లు వెల్లువెత్తున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆందోళన మరింత ఉధృ తం చేయడంలో ప్రభుత్వ పునరాలోచనలో పడింది. ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లపై ఇటీవల ఎయిడెడ్‌ విద్యా సంస్థల యాజమాన్యాలతో జేసీ రాజకుమారి చర్చలు నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్స్‌ ఎంచుకో వచ్చునని, విలీనం విషయంలో ఒత్తిడి లేదని స్పష్టం చేయడంతో పరిస్థితి యథావిధిగా వస్తోంది. 

జిల్లాలో 365 ఎయిడెడ్‌ పాఠశాలున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరివారంలో దాదాపు 270 ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి పాఠశాలలు అప్పగించేందుకు అంగీకరించాయి. ఈమేరకు లేఖలు(విల్లింగ్‌) కూడా ఇచ్చారు. మరో 95 పాఠశాలల యాజ మాన్యాలు లేఖలు ఇవ్వ కుండా న్యాయ పోరాటా నికే మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఇటు విద్యార్థి సంఘాలు, అటు విద్యార్థు లు, తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి చేయ డంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. దీంతో 195 పాఠశాలలు విలీన లేఖల్ని మరలా వెనక్కి తీసుకున్నాయి.


తొలుత ఆసక్తి.. తరువాత అనాసక్తి

ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేసే  దాదాపు 700 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది  ప్రభు త్వ పరిధిలోకి రావడానికి తొలుత ఎంతో ఉత్సాహం చూపారు. అయితే ఇందులో న్యాయపరమైన సమ స్యలు ఉన్నాయని, భవిష్యత్తులో ఇది సర్వీస్‌పై పడే ప్రమాదం ఉందని తెలియడంతో అనేకమంది మర లా పూర్వ పాఠశాలల్లోకి చేరడానికి సిద్ధం అవు తున్నారు. మరోవైపు వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి మారుమూల ప్రాంతాల్లోకి బదిలీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఉపాధ్యా యులు తాము పనిచేసిన పూర్వపాఠశాల్లోకి రావడా నికి మానసికంగా సిద్ధం అవుతున్నారని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


ప్రభుత్వ ఇచ్చిన ఆప్షన్లు ఇవీ..

ఎయిడెడ్‌ యాజ మా న్యాలకు ప్రభుత్వం నాలు గు అప్షన్లు ఇచ్చింది. మొ దటిది ఎయిడెడ్‌ పా ఠశా లలకు సంబంధించిన ఆ స్తులు, ఉపాధ్యాయుల తో సహా ప్రభుత్వానికి అప్ప గించడం. రెండోది ఉపాధ్యాయుల్ని ప్రభుత్వానికి అప్పగించి పాఠశాలల్ని ప్రైవేటుగా నిర్వహించు కోవడం. మూడోది పాఠశాలల్ని ప్రస్తుత పద్ధతిలోనే యధావిఽధిగా నిర్వహించుకోవడం. చివరిది ఇప్పటికే విలీనం కోసం అంగీకరం తెలిపినా ఆ నిర్ణయాన్ని మార్చుకుని అన్‌విల్లింగ్‌ ఇవ్వడం. ఈ నాలుగింటిలో అత్యధికమంది 3, 4 ఆప్షన్ల వైపు మొగ్గుచూపుతున్నా రని సమాచారం. దీంతో క్రమంగా ఎయిడెడ్‌ విద్యా సంస్థలు పూర్వవిధంగానే కొనసాగే అవకాశం ఉందని యజమాన్యాలు  భావిస్తున్నాయి.


 

Updated Date - 2021-11-17T05:23:32+05:30 IST