‘హింసను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం’

ABN , First Publish Date - 2020-12-02T05:59:32+05:30 IST

మహిళలపై పెరుగుతున్న హింస ను నియంత్రిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యా యని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు.

‘హింసను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం’
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభావతి


భువనగిరి టౌన్‌, డిసెంబరు 1: మహిళలపై పెరుగుతున్న హింస ను నియంత్రిం చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యా యని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. భువనగిరిలో జరిగిన ఐద్వా సమా వేశంలో ఆమె మాట్లాడారు. మహి ళలపై రోజురోజుకు అత్యాచారాలు, హింస పెరుగుతున్నదని అయినప్పటికీ పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే రాష్ట్ర మహిళా కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి భట్టుపల్లి అనురాధ, కొండమడుగు నాగమణి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-02T05:59:32+05:30 IST