ఎయిమ్స్‌లో ఓపీడీ సేవ‌లు షురూ... ఇన్‌ఫ్లుయెంజా టెస్టు త‌ప్ప‌నిస‌రి!

ABN , First Publish Date - 2020-07-14T15:56:12+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ, జూన్ 25 నుంచి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఓపీడీ సేవలు ప్రారంభించారు.

ఎయిమ్స్‌లో ఓపీడీ సేవ‌లు షురూ... ఇన్‌ఫ్లుయెంజా టెస్టు త‌ప్ప‌నిస‌రి!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ, జూన్ 25 నుంచి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఓపీడీ సేవలు ప్రారంభించారు. అయితే రోజుకు 15 మంది రోగులకు మాత్రమే ఇటువంటి అవ‌కాశం క‌ల్పిస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో ఓపీడీ సేవ‌ల‌ను  ప్రారంభించారు. మీడియాకు అందిన స‌మాచారం ప్రకారం ప్ర‌స్తుతం ఎయిమ్స్‌లో 30 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక‌పై రోజుకు 30 మంది రోగుల‌కు ఓపీడీ సేవ‌లు అందించ‌నున్నారు. రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిమ్స్ తెలిపింది. అయితే ఓపీడీలో ప్రవేశానికి ముందు బాధితుల‌కు ఇన్‌ఫ్లుయెంజా పరీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. త‌రువాత మాత్ర‌మే ఓపీడీలో ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు. 

Updated Date - 2020-07-14T15:56:12+05:30 IST