ఏయూ వీసీతో ఏఐఐఎల్‌ఎస్‌జీ డీజీ సమావేశం

Published: Tue, 09 Aug 2022 00:46:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏయూ వీసీతో ఏఐఐఎల్‌ఎస్‌జీ డీజీ సమావేశంవీసీకి నివేదికను అందజేస్తున్న డాక్టర్‌ జైరాజ్‌ పాఠక్‌

ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 8: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డితో సోమవారం వర్సిటీలో ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్‌(ఏఐఐఎల్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జైరాజ్‌ ఫాఠక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏయూతో ఏఐఐఎల్‌ఎస్‌జీ సంస్థ ఎంవోయూ చేసుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. సంయుక్తంగా కోర్సుల నిర్వహణ, పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఆచార్యులు చల్లా రామకృష్ణ, కృష్ణవీర్‌ అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.