Asaduddin Owaisi: పీఎఫ్‌ఐ‌పై నిషేధానికి మద్దతు ఇవ్వలేను

ABN , First Publish Date - 2022-09-29T03:04:10+05:30 IST

హైదరాబాద్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం నిషేధం విధించడంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

Asaduddin Owaisi: పీఎఫ్‌ఐ‌పై నిషేధానికి మద్దతు ఇవ్వలేను

హైదరాబాద్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం నిషేధం విధించడంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నేరానికి పాల్పడే కొంతమంది వ్యక్తుల చర్యల వల్ల సంస్థను నిషేధించాలని కాదన్నారు. ఒకరిని దోషిగా నిర్ధారించడానికి కేవలం ఒక సంస్థతో అనుబంధం మాత్రమే సరిపోదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిందని ఆయన గుర్తు చేశారు. తాను ఎల్లప్పుడూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నానని ఒవైసీ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య విధానాన్ని సమర్ధిస్తున్నప్పటికీ, పీఎఫ్‌ఐ‌పై నిషేధానికి మద్దతు ఇవ్వలేనన్నారు. ఈ రకమైన నిషేధం ప్రమాదకరమని చెప్పారు. 





అంతకు ముందు కేంద్రం పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూఏపీఏ చట్టం (UAPA Act) కింద కేంద్రం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), గుజరాత్ (Gujarath), కర్ణాటక (Karnataka) ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞాపన మేరకే పీఎఫ్ఐపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అనేక దాడుల్లో... ఈ మూడు రాష్ట్రాల్లో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయని, వాటి ఆధారంగా..  పీఎఫ్ఐను నిషేధించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశామని అధికార వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-09-29T03:04:10+05:30 IST