సమాజ్‌వాదీ పార్టీతో పొత్తును తోసిపుచ్చిన ఒవైసీ

ABN , First Publish Date - 2021-07-25T21:07:42+05:30 IST

వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునే..

సమాజ్‌వాదీ పార్టీతో పొత్తును తోసిపుచ్చిన ఒవైసీ

లక్నో: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తోసిపుచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు సమాజ్‌వాదీ పార్టీ ప్రాతినిధ్యం కల్పించలేదని అన్నారు. ముస్లిం వర్గంతో కలిసి పనిచేస్తామని చెబుతున్న సమాజ్‌వాదీ పార్టీ గతంలో 20 శాతం ముస్లిం ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చినప్పటికీ ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేకపోయిందని అన్నారు. అలాంటి ఎస్‌పీతో పొత్తు పెట్టుకునేది లేదని చెప్పారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని వాగ్దానం చేస్తే సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని రాష్ట్ర ఎంఐఎం చీఫ్ సౌకత్ అలి చెప్పినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒవైసీ తాజా వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ప్రస్తుతం చిన్న పార్టీలతో కూడిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ సారథ్యంలోని భాగీదారీ సంకల్ప్ మోర్చాలో భాగంగా ఉంది.

Updated Date - 2021-07-25T21:07:42+05:30 IST