హాంకాంగ్‌కు Air India విమాన సర్వీసుల రద్దు
ABN , First Publish Date - 2022-04-18T13:07:57+05:30 IST
మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో విమానసర్వీసులు నిలిచిపోతున్నాయి....
కొవిడ్ ఆంక్షల ఫలితం
న్యూఢిల్లీ: మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో విమానసర్వీసులు నిలిచిపోతున్నాయి. హాంకాంగ్ దేశ అధికారులు విధించిన కొవిడ్ ఆంక్షల ఫలితంగా హాంకాంగ్‌కు భారతదేశం నుంచి విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ‘‘హాంకాంగ్ అధికారులు విధించిన కొవిడ్ ఆంక్షల వల్ల ఏప్రిల్ 19, 23 తేదీల్లో విమాన సర్వీసులను రద్దు చేశాం’’ అని ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. విమాన ప్రయాణానికి 48 గంటల ముందు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే భారతదేశం నుంచి హాంకాంగ్ కు విమాన ప్రయాణం చేయవచ్చని ఆ దేశ అధికారులు ఆదేశాలు చేశారు.ఈ ఏడాది జనవరి నెలలో ఒమైక్రాన్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో హాంకాంగ్ భారతదేశంతో సహా 8 దేశాల నుంచి ఇన్కమింగ్ విమానాలపై రెండు వారాలపాటు నిషేధాన్ని ప్రకటించింది.