
ముంబై: ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే ఎయిర్ ఇండియా(Air India)కు చెందిన విమానానాన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా తిరిగి ముంబైకి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. విమానం బయలుదేరిన కేవలం 27 నిమిషాలకు గాలిలో ఉండగానే ఒక ఇంజన్ (engine) ఆగిపోయింది.
ఇవి కూడా చదవండి
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 9.43 గంటలకు విమానం బయలుదేరింది. కొద్దిసేపటికే ఒక ఇంజన్లో హై ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్‌కు సంబంధించిన హెచ్చరిక పైలట్‌కు అందడంతో ఆయన వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి 10.10 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేర్చినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రయాణికుల భద్రతే తమకు ప్రధానమని, సిబ్బంది కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే సుశిక్షితులని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఇంజన్ మెయింటెనెన్స్ సిబ్బంది వెంటనే లోపాన్ని గుర్తించి సరిచేస్తున్నారని చెప్పారు. ఘటన అనంతరం ప్రయాణికులను తమతమ గమ్య స్థానాలకు చేరేందుకు వేరే విమానాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.