కీవ్‌లో ల్యాండైన ఎయిర్ ఇండియా తొలి విమానం

ABN , First Publish Date - 2022-02-22T21:38:18+05:30 IST

ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను

కీవ్‌లో ల్యాండైన ఎయిర్ ఇండియా తొలి విమానం

కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు బయలుదేరిన మూడు ఎయర్ ఇండియా విమానాల్లో తొలి విమానం కొద్దిసేపటి క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ల్యాండ్ అయింది. 200 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ డ్రీమ్‌లైనర్ బి-787 విమానం ఈ రాత్రికి తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది.


మిగతా రెండు విమానాల్లో ఒకటి ఈ నెల 24న, 26న మరోటి రానున్నాయి. వీటికోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎయిర్ ఇండియా బుకింగ్ కార్యాలయాలు, వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులు తాత్కాలికంగా దేశాన్ని విడిచి రావాలని భారత ప్రభుత్వం సూచించింది. ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 20 వేల మందికిపైగా భారత విద్యార్థులు నివసిస్తున్నారు.

Updated Date - 2022-02-22T21:38:18+05:30 IST