కారు కన్నా తక్కువ ధరకే ఎయిర్ ట్యాక్సీ.. బుకింగ్‌ కోసం ఎగబడుతున్న కస్టమర్లు..!

ABN , First Publish Date - 2022-05-24T01:20:31+05:30 IST

దేశ వ్యాప్తంగా ట్రాఫిక్‌ సమస్య పెను సవాల్‌గా మారింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు ట్రాఫిక్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు

కారు కన్నా తక్కువ ధరకే ఎయిర్ ట్యాక్సీ.. బుకింగ్‌ కోసం ఎగబడుతున్న కస్టమర్లు..!

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా ట్రాఫిక్‌ సమస్య పెను సవాల్‌గా మారింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు ట్రాఫిక్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం పలువురు వందల కోట్ల డాలర్లు ఈ-వీటోల్‌ ప్రాజెక్టుపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ-వీటోల్‌ అంటే ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్స్‌ అండ్‌ లాండింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ అని అర్థం. ఇవి యాప్‌లో బుక్‌ చేసే ఆటోలు, ట్యాక్సీల్లాంటివే. కాకపోతే ఎయిర్‌ట్యాక్సీలు. ఈ విద్యుత్‌ విమానాలు నేరుగా మన ఇంటి పైకప్పుపై ల్యాండ్‌ అవుతాయి. దాంట్లో మనం ఎక్కి కూర్చోగానే నిట్టనిలువునా పైకి లేచి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి గమ్యస్థానానికి చేరుస్తాయి. 



చార్జీలు మాత్రం ట్యాక్సీకన్నా 2-3 రెట్లు ఎక్కువ ఉంటాయి. చార్జీ ఎంతయినా పర్లేదు అర్జెంటుగా వెళ్లాలి అనుకునేవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ విద్యుత్తు విమానాల ధర 16 నుంచి 39 లక్షలు ఉంటుందని అంచనా..  భవిష్యత్తు నగరయానం వీటిపైనే ఆధారపడి ఉందని గూగుల్‌, లింక్డ్‌ఇన్‌, జింగా, ఉబెర్‌, ఎయిర్‌బస్‌, బోయింగ్‌, హోండా వంటి దిగ్గజ కంపెనీల అధినేతలు భావిస్తున్నారు. అందుకే మనదేశానికి చెందిన కార్పొరేట్‌ చార్టర్‌ జెట్‌ కంపెనీ జెట్‌ సెట్‌గో సంస్థ ఈ-వీటోల్స్‌లో 20 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఈ ప్లేన్‌ కంపెనీ అనే స్టార్టప్‌ కూడా తాను అభివృద్ధి చేసిన ప్రోటోటైప్‌ ఈ వీటోల్‌ను దుబాయ్‌లో పరీక్షించింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ గాలిలో అర కిలోమీటర్‌ నుంచి 2 కిలోమీటర్ల ఎత్తున గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 2024 డిసెంబరు నాటికి ప్రయాణికులకు ఈ వీటోల్‌ అందుబాటులోకి రానుంది.




Updated Date - 2022-05-24T01:20:31+05:30 IST