హైదరాబాద్‌లో విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు కేంద్రం

ABN , First Publish Date - 2022-07-06T22:22:47+05:30 IST

Hyderabad: ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ సంస్థ విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేస్తుంది. ఈ సంస్థ విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్ కేంద్రాన్ని (MRO) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. రూ. 15 కోట్ల అమెరికన్ డాలర్లతో కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. Hyderabad: ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ సంస్థ విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేస్తుంది. ఈ సంస్థ విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్ కేంద్రాన్ని (MRO) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. రూ. 15 కోట్ల అమెరికన్ డాలర్లతో కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు.

హైదరాబాద్‌లో విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు కేంద్రం

రూ. 15 కోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చు చేయనున్న ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ సంస్థ

Hyderabad: ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ సంస్థ విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేస్తుంది. ఈ సంస్థ విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్ కేంద్రాన్ని (MRO) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. రూ. 15 కోట్ల అమెరికన్ డాలర్లతో కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు.


ఈ సందర్భంగా ఐటీ శాఖమంత్రి కే. తారకరామారావు మాట్లాడారు. దేశంలో శాఫ్రాన్ తన తొలి MRO కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం (MRO) ఇదేనని,  మనదేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం ఇదేనని చెప్పారు. పౌర, సైనిక విమానాలకు అధునాతన ఇంజిన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో శాఫ్రాన్‌ ఒకటని, ఎంఆర్‌వో ఏర్పాటుతో సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. భారత్‌తో పాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్‌-1ఏ, లీప్‌-1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్‌లోనే చేస్తారని తెలిపారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ఎంఆర్‌వో కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలో ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందన్నారు.  

Updated Date - 2022-07-06T22:22:47+05:30 IST