India-UAE flights: భారత్ నుంచి యూఏఈకి అక్టోబర్‌లో రెట్టింపు కానున్న విమాన టికెట్ల ధరలు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-26T14:10:06+05:30 IST

అక్టోబర్ మాసంలో యూఏఈ (UAE) వెళ్లే ఆలోచనలో ఉంటే ముందే టికెట్ బుక్ చేసుకోవడం మేలు.

India-UAE flights: భారత్ నుంచి యూఏఈకి అక్టోబర్‌లో రెట్టింపు కానున్న విమాన టికెట్ల ధరలు.. కారణం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: అక్టోబర్ మాసంలో యూఏఈ (UAE) వెళ్లే ఆలోచనలో ఉంటే ముందే టికెట్ బుక్ చేసుకోవడం మేలు. లేకుంటే ఆ నెలలో భారత్ నుంచి యూఏఈ వెళ్లేవారికి విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపించడం ఖాయం. ఈ విషయం స్వయంగా ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వచ్చే అక్టోబర్‌ను (October) బంపర్ మంత్‌గా పేర్కొంటున్నాయి. అయితే, అక్టోబర్‌లో విమాన టికెట్ల ధరలు (Airfares) ఎందుకు పెరుగుతాయని అడిగితే.. ఆ ఒకే నెలలో దసరా (Dasara), దీపావళి (Diwali) పండుగలు రావడమేనని ట్రావెల్ ఏజెన్సీలు (Travel Agencies) చెబుతున్నమాట. అక్టోబర్ 5న దసరా ఉంటే.. అక్టోబర్ 24 దీపావళి ఉంది. 


ఇలా 15 రోజుల వ్యవధిలో అది ఒకే నెలలో హిందూవుల రెండు పెద్ద పండుగలు రావడం విమాన టికెట్లకు రెక్కలు రావడానికి కారణం అంటున్నాయి. ఆ సమయంలో భారత్ నుంచి దుబాయ్ (Dubai) వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుందట. దీంతో అక్టోబర్ నెలకు సంబంధించి బస కోసం హోటల్ రూమ్స్ బుకింగ్స్‌కు కూడా ఇప్పటి నుంచే మొదలైనట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇప్పటికే బుర్ దుబాయ్‌లో పండుగ రోజుల్లో 100శాతం బుకింగ్స్ పూర్తి అయ్యాయని హోటల్ యజమానులు చెబుతున్నారట. 


ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ అద్నానీ మాట్లాడుతూ.. అక్టోబర్ నెలలో విమాన టికెట్ల ధరలు (Airfares) రెట్టింపు కావడం ఖాయం. ఒకే నెలలో దసరా, దీపావళి వస్తుండడంతో ఈసారి భారత్ (India) నుంచి యూఏఈకి ప్రయాణాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే బుర్ దుబాయ్‌లోని హోటళ్లలో అక్టోబర్ నెలకు సంబంధించి బుకింగ్స్ (Bookings) 100శాతం పూర్తైనట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. అందుకే అక్టోబర్ బంపర్ మంత్ కాబోతుందని అవినాష్ చెప్పుకొచ్చారు. ఒకవేళ అక్టోబర్‌లో దుబాయ్‌ను సందర్శించే ఆలోచనలో ఉంటే మాత్రం ఇప్పుడే విమాన టికెట్స్, బస కోసం హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ముంబై (Mumbai), ఢిల్లీ నుంచి యూఏఈకి సెప్టెంబర్ 10 నుంచి 15 తేదీ వరకు విమాన టికెట్ల ధరలు సగటున వెయ్యి దిర్హమ్స్ (రూ.21,751) నుంచి 1200 దిర్హమ్స్‌ (రూ.26,102)గా ఉంటే.. అదే అక్టోబర్‌లో ఈ ధరలు 2వేల దిర్హమ్స్ (రూ.43,503) వరకు పలికే అవకాశం ఉందన్నారు.  

Updated Date - 2022-08-26T14:10:06+05:30 IST