ఎయిర్‌పోర్టు - కిలాంబాక్కం మధ్య రూ.4వేల కోట్లతో మెట్రో మార్గం

ABN , First Publish Date - 2022-03-10T13:49:11+05:30 IST

స్థానిక మీనంబాక్కం విమానాశ్రయం నుంచి కిలాంబాక్కం వరకు రూ.4వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలు మార్గా న్ని నిర్మించనున్నట్లు మెట్రో సంస్థ అధికారులు తెలిపారు. నగరంలో విమానాశ్రయం - విమ్కోనగర్‌, పరంగమలై -

ఎయిర్‌పోర్టు - కిలాంబాక్కం మధ్య రూ.4వేల కోట్లతో మెట్రో మార్గం

చెన్నై: స్థానిక మీనంబాక్కం విమానాశ్రయం నుంచి కిలాంబాక్కం వరకు రూ.4వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలు మార్గా న్ని నిర్మించనున్నట్లు మెట్రో సంస్థ అధికారులు తెలిపారు. నగరంలో విమానాశ్రయం - విమ్కోనగర్‌, పరంగమలై - సెంట్రల్‌ రైల్వే స్టేషన్ల మధ్య నడుపుతున్న మెట్రోరైళ్లలో ప్రతిరోజూ 1.15లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఈ సంఖ్య రోజురోజుకూ అధికమవుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో విమానాశ్రయం నుంచి కిలాంబాక్కం సబర్బన్‌ బస్‌స్టేషన్‌ వరకూ 15.3 కిలోమీటర్ల మేర మెట్రోరైలు మార్గం నిర్మాణానికి ప్రాజెక్టు ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు మెట్రో రైల్వేస్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త మెట్రో రైలు మార్గం నిర్మాణానికి రూ.4080 కోట్ల మేర అవసరమవుతుందని తెలిపారు. ఈ కొత్త మార్గంలో 12 మెట్రోరైల్వేస్టేషన్లు కూడా నిర్మిస్తా మన్నారు. విమానాశ్రయం తర్వాత పల్లావరం, కోదండంనగర్‌, క్రోంపేట, మహాలక్ష్మి కాలనీ, తిరువిక నగర్‌, తాంబరం, ఇరుంబులియూరు, పీర్కాకరణై, పెరంగళత్తూరు, వండలూరు, అన్నా జంతు ప్రదర్శనశాల, కిలాంబాక్కం ప్రాంతాల్లో మెట్రోరైల్వేస్టేషన్లను నిర్మించనున్నట్లు అధికారులు వివరించారు. ఈ కొత్త మెట్రోరైలు మార్గం ప్రాజెక్టు పూర్తయితే దక్షిణాది జిల్లాల నుంచి చెన్నై వచ్చే ప్రయాణికులు, చెన్నై నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లేవారు సులువుగా గమ్యస్థానాలను చేరుకోగలుగుతారని తెలిపారు. ఈ రైలు మార్గం పూర్తిగా స్తంభాలపైనే నిర్మించటం వల్ల మీనాం బాక్కం కిలాంబాక్కం మధ్య రహదారుల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడదని తెలిపారు. ప్రస్తుతం వండలూరు జూ సమీపంలోని కిలాంబాక్కం వద్ద సబర్బన్‌ బస్‌ స్టేషన్‌ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతు న్నాయని, వచ్చే యేడాది ఆ బస్‌స్టేషన్‌ ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మీనం బాక్కం - కీలంబాక్కం మెట్రోరైలు మార్గం ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించి, 2026లోగా పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ రైలు మార్గం వల్ల ప్రస్తుతం తాంబరం, పెరంగుళత్తూరు, వండలూరు జీఎస్టీ రహదారుల్లోని వాహనాల రద్దీ పూర్తిగా తొలగి పోతుందని మెట్రోరైల్వేస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

Updated Date - 2022-03-10T13:49:11+05:30 IST