విమానాశ్రయ భద్రతకు బెల్జియం జాగిలాలు

Published: Thu, 12 May 2022 08:09:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విమానాశ్రయ భద్రతకు బెల్జియం జాగిలాలు

పెరంబూర్‌(చెన్నై): చెన్నై విమానాశ్రయ భద్రతకు బెల్జియం దేశానికి చెందిన రెండు జాగిలాలు సిద్ధమయ్యాయి. విమానాశ్రయానికి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్ఎఫ్‌) భద్రత కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మూడు నెలల వయసున్న ఆ రెండు ప్రత్యేక బెల్జియం జాగిలాలను సీఐఎస్ఎఫ్ విభాగంలో చేర్చారు. ఈ సందర్భంగా వాటికి మంగళవారం పేర్లు కూడా పెట్టారు. ఒకదానికి వీర, మరోదానికి భైరవ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐఎస్ఎఫ్‌ డీఐజీ శ్రీరామ్‌ మాట్లాడుతూ... విమానాశ్రయ భద్రతలో ఇప్పటికే ఏడు జాగిలాలున్నాయన్నారు. బెల్జియం జాగిలాలు ప్రస్తుతం పలు దేశాల్లో భద్రతా పనుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నందున చెన్నై విమానాశ్రయ భద్రత కోసం రెండింటిని తెప్పించామన్నారు. వాటిని ఈ నెల 14వ తేదీ బెంగుళూరులోని ప్రత్యేక శిక్షణా కేంద్రానికి తరలిస్తున్నామని, అవి అక్కడే ఆరు నెలల పాటు శిక్షన పొందుతాయన్నారు. శిక్షణ ముగిశాక వాటిని చెన్నై విమానాశ్రయ భద్రతా విధుల్లోకి ప్రవేశపెడతామని శ్రీరాం వివరించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.