ఛత్తీ్‌సగఢ్‌లో వైమానిక దాడులొద్దు: ప్రముఖులు

ABN , First Publish Date - 2022-04-28T08:33:17+05:30 IST

ఛత్తీ్‌సగఢ్‌, ఆ పరిసర గిరిజన ప్రాంతాల్లో వైమానిక దాడులు జరపవద్దని భారత్‌లోని 30 మంది ప్రముఖులు ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఛత్తీ్‌సగఢ్‌లో వైమానిక  దాడులొద్దు: ప్రముఖులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: ఛత్తీ్‌సగఢ్‌, ఆ పరిసర గిరిజన ప్రాంతాల్లో వైమానిక దాడులు జరపవద్దని భారత్‌లోని 30 మంది ప్రముఖులు ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భద్రతా శిబిరాల ఏర్పాటు, బూటకపు ఎన్‌కౌంటర్లను, సామూహిక అరెస్టులను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న గ్రామస్థులతో చర్చలు జరపాలన్నారు. సంతకాలు చేసినవారిలో సిటిజన్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌కు చెందిన తీస్తా సెతల్వాద్‌, ఛత్తీ్‌సగఢ్‌ బచావో ఆందోళన్‌ సభ్యురాలు బేలా భాటియా తదితరులు ఉన్నారు. ఈ నెల 14, 15 తేదీల మధ్య అర్థరాత్రి మావోయిస్టులను మట్టుబెట్టేందుకు గాను తమ గ్రామాల చుట్టూ అటవీ ప్రాంతాల్లో బలగాలు బాంబు దాడులు చేశాయని ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా గిరిజనులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-04-28T08:33:17+05:30 IST