నందినిగా అందాల Aishwarya

Published: Wed, 06 Jul 2022 13:59:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నందినిగా అందాల Aishwarya

అగ్ర దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్ - 1' (Ponniyin Selvan: I). తాజాగా ఈ సినిమాలో నందిని పాత్రలో నటిస్తున్న మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం మన సౌత్ భాషలలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలు తయారవుతున్నాయి. వాటిలో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' కూడా ఒకటి. కల్కీ కృష్ణమూర్తి రాసిన ప్రముఖ నవల 'పొన్నియన్ సెల్వన్' ఆధారంగా అదే పేరుతో ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ పీఎస్ - 1 సెప్టెంబర్ 30న పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న కార్తి లుక్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 

గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన 'గురు', 'రావణ్' చిత్రాలలో నటించారు. 'రావణ్' తర్వాత మళ్ళీ ఇంతవరకు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని ఐష్, ఇప్పుడు 'పొన్నియన్ సెల్వన్' సిరీస్‌తో రాబోతున్నారు. కాగా, మొదటి భాగంలో ఆమె పోషిస్తున్న పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది.  ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, అందులో ఓ పాత్రలో పళువూర్ క్వీన్ నందినిగా కనిపించబోతున్నారు. 'ప్రతీకారానికి అందమైన ముఖం..ఇదుగో పజువూరు రాణి నందిని'అంటూ మేకర్స్ ఈ పాత్రని పరిచయం చేయడం ఆసక్తికరం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ సినిమాలో 'చియాన్' విక్రమ్ (Vikram), కార్తి (Karthi), త్రిష (Trisha), శోభిత ధూళిపాళ్ళ (Shobhita Dhulipaala) తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International