అలా చెప్పినప్పుడే సంతృప్తి: ఐశ్వర్య లక్ష్మి

Jun 6 2021 @ 10:28AM

నయనతార తమిళంలో స్పష్టంగా మాట్లాడగలదు. కానీ, ఆమె నటించే తమిళ చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పదు. అయితే, ఇటీవల కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఐశ్వర్య లక్ష్మి ఇందుకుభిన్నం. ఆమె వెండితెరకు పరిచయమైన తొలి చిత్రంలోనే తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పి ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంది. అలాగే, ఈ నెల 18వ తేదీన ఓటీటీలో విడుదలకానున్న హీరో ధనుష్‌ నటించిన ‘జగమే తందిరమ్‌’ చిత్రంలో కూడా ఈమె నటించి, తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పింది. అలాగే, మణిరత్నం తెరకెక్కిస్తున్న దృశ్యకావ్యం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలోనూ ఈమె క్లాసికల్‌ తమిళంలో మాట్లాడనుంది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ, ‘ఒక చిత్రంలో నేను పోషించిన పాత్రకు నేనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పినపుడే ఆ చిత్రంలో నటించాననే తృప్తి కలుగుతుంది. పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలోనూ నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్తానని దర్శకుడిని కోరుతున్నాను. ఇందుకోసం అవసరమైన శిక్షణను కూడా తీసుకుంటున్నాను. ఇతర భాషల్లో నటించే అవకాశం లభించినా ఆ భాషల్లో డబ్బింగ్‌ చెప్పేందుకు ప్రయత్నిస్తాను. మనం చేసిన పాత్రలకు మనమే డబ్బింగ్‌ చెప్పినపుడే పరిపూర్ణ నటి అనిపించుకోగలుగుతాం’ అని పేర్కొంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.