జాతీయ జెండాల ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-12T05:28:01+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా గురువారం నూజివీడులో నందవనం తోట నుంచి పీజీ సెంటర్‌ వరకు హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు.

జాతీయ జెండాల ప్రదర్శన
నూజివీడులో హెరిటేజ్‌ వాక్‌

నూజివీడు, ఆగస్టు 11: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా గురువారం నూజివీడులో నందవనం తోట నుంచి పీజీ సెంటర్‌ వరకు హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు. ఆర్డీవో రాజ్యలక్ష్మి హెరిటేజ్‌ వాక్‌ను ప్రారం భించగా నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో పాటు త్రివిధ, కుమార్‌, సిద్ధార్థ జూనియర్‌ కళాశాల, వాగ్ధేవి, శారద జూనియర్‌ కళాశాలల విద్యార్థులు 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజ్యలక్ష్మి, డీఎస్పీ బి.శ్రీనివాసులు మాట్లాడారు. స్నేహా రైడ్స్‌, కుమార్‌, త్రివిధ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకటు ్టకున్నాయి. నూజివీడు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రామిశెట్టి త్రివేణిదుర్గ, వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ, మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ రామిశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు.

నూజివీడు పట్టణ, మండల ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లో తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. నూజివీడు మం డలం గొల్లపల్లి అన్నే రామకృష్ణయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతా వనిని కీర్తిస్తూ విద్యా ర్థులు 75 సంఖ్య ఆకారంలో ప్రదర్శన నిర్వహించారు.

ముదినేపల్లి : ఆజాదీ కా అమృత్‌ మహోత్స వంలో భాగంగా గురువారం ముదినేపల్లిలో విద్యార్థులు హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. హైస్కూల్‌ హెచ్‌ఎం ప్రభుదాసు, గ్రంథాలయాఽ దికారిణి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఎస్‌ఐ షణ్ముఖసాయి స్వాతంత్ర్యోద్యమ విశిష్టతను వివరించారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముదినేపల్లి వై.జంక్షన్‌లో ‘స్వాతంత్య్ర భారత్‌కి జై, భారత్‌ మాతాకి జై’ నినాదాలు మార్మోగాయి. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాల్సిన ఆవశ్యకతను తెలిపారు.  

ముసునూరు :ముసునూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార ్థులు గ్రామ ప్రధాన రహదారులలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఎం ఎం.శ్రీనివాస్‌, సచివాలయ సెక్రటరీ మాధవి ఉన్నారు. భారతీ విద్యానికేతన్‌ ఆధ్వర్యంలోనూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముసునూరు జడ్పీటీసీ వరికూటి ప్రతాప్‌, సహకార సంఘ అధ్యక్షుడు మానికల శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపాల్‌ కొండేటి శౌరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 



Updated Date - 2022-08-12T05:28:01+05:30 IST