ఓటీటీలో అజయ్ దేవ్‌గణ్ సినిమా..!

Apr 23 2021 @ 10:03AM

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'. అభిషేక్ దుదైయ్య దర్శకత్వం వహించాడు. 1971లో ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్, రానా దగ్గుబాటి, సంజయ్ దత్, శరద్ ఖేల్కర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ పాత్రలో నటించగా.. కేవలం కాలి వేలిముద్రలను చూసి జెండర్ హైట్ వెయిట్ గుర్తించగల రాంచోర్ దాస్ స్వభాయ్ రావరీ పాగి పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే మద్రాస్ రెజిమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ పాత్రను రానా పోషించాడు. కాగా ఈ సినిమాని ప్రముఖ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి రెడీ అయిందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగష్టు నెలలో 13 లేదా 15 తేదీలలో ఒక తేదీని కన్ఫర్మ్ చేయనున్నారట. త్వరలో అధికారకంగా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అజయ్ దేవ్‌గణ్ టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన అజయ్ దేవ్‌గణ్ లుక్ సౌత్ అండ్ నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న విజయదశమి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. 

Follow Us on:
Advertisement
 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.