బీచుపల్లిలో సినీనటుడు అజయ్
ABN , First Publish Date - 2022-09-25T05:57:05+05:30 IST
బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శనివారం సినీనటుడు అజయ్ దర్శించుకున్నారు. తన తండ్రి సాంబశివరావు మూడునెలల క్రితం మృతి చెం దగా, కుటుంబసభ్యులతో వచ్చిన అజయ్ పిండప్రదాన కార్యక్రమాన్ని చేశారు.
- కృష్ణానదిలో తండ్రికి పిండప్రదానం
ఎర్రవల్లి చౌరస్తా, సెప్టెంబరు 24: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శనివారం సినీనటుడు అజయ్ దర్శించుకున్నారు. తన తండ్రి సాంబశివరావు మూడునెలల క్రితం మృతి చెం దగా, కుటుంబసభ్యులతో వచ్చిన అజయ్ పిండప్రదాన కార్యక్రమాన్ని చేశారు. ఆలయ పురోహితుడు అనిల్‌శర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బీచుపల్లి అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో రామన్‌గౌడు శేషవస్త్రాలను అందించి తీర్థప్రసాదాలను ఇచ్చారు.