Congress :ఆ రెండు పథకాలూ కవలల పిల్లలు : మాకెన్

ABN , First Publish Date - 2021-09-04T00:04:29+05:30 IST

గతంలో ప్రకటించిన నోట్ల రద్దు, తాజాగా ప్రకటించిన ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్’ రెండూ కవల పిల్లలని కాంగ్రెస్ సీనియర్ నేత

Congress :ఆ రెండు పథకాలూ కవలల పిల్లలు : మాకెన్

న్యూఢిల్లీ : గతంలో ప్రకటించిన నోట్ల రద్దు, తాజాగా ప్రకటించిన ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్’ రెండూ కవల పిల్లలని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ఈ రెండు విధానాల ద్వారా కేంద్రం ప్రజలను నిండా దోచుకుంటోందని విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన అజయ్ మాకెన్ మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామంటూ కేంద్రం ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టిందని, రెంటికీ పెద్ద భేదమేమీ లేదని విమర్శించారు. నోట్ల రద్దు ద్వారా చిన్న వ్యాపారులను దండుకున్నారని, మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా దేశ వారసత్వాన్ని దోపిడీ చేస్తున్నారని, ఈ రెండూ కొద్దిమంది వ్యాపారవేత్తల కోసమే ప్రకటించారని మాకెన్ ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-09-04T00:04:29+05:30 IST