సరికొత్త లుక్‌లో అజిత్‌

Published: Sat, 22 Jan 2022 20:28:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సరికొత్త లుక్‌లో అజిత్‌

అగ్రహీరో అజిత్‌ తన తదుపరి చిత్రంలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. అందు కోసం ఆయన స్లిమ్‌గా తయారయ్యేందుకు సైక్లింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అజిత్‌ - హెచ్‌.వినోద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వలిమై’ చిత్రం చివరి నిమిషంలో సంక్రాంతి రేస్‌ నుంచి తప్పుకుంది. ఇపుడు ఆ మూవీని ఎపుడు రిలీజ్‌ చేస్తారో తెలియదు. ‘వలిమై’ తర్వాత అజిత్‌ తన 61వ చిత్రాన్ని కూడా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలోనే చేయనున్నారు. ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూరే నిర్మించనున్నారు.


‘వలిమై’ లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన అజిత్‌.. తన 61వ చిత్రంలో మరో విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన బరువు తగ్గించుకుని స్లిమ్‌గా కనిపించనున్నారు. అందుకే ఆయన ముమ్మరంగా సైక్లింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ.. గంటల కొద్దీ జిమ్‌లో గడుపుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International