వైరల్ వీడియో.. లండన్‌లో Ajith Kumar షాపింగ్

Published: Tue, 05 Jul 2022 15:55:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వైరల్ వీడియో.. లండన్‌లో Ajith Kumar షాపింగ్

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar). కొన్ని రోజుల నుంచి బైక్‌పై వరల్డ్ టూర్ చేస్తున్నాడు. ఈ బైక్ ట్రిప్‌లో భాగంగా అజిత్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అతడు లండన్‌లో షాపింగ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.   


లండన్‌లోని డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో అజిత్ కొన్ని వస్తువులను కొనుగోలు చేశాడు. బిల్ కౌంటర్‌లోని వ్యక్తితో కాసేపు మాట్లాడాడు. అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కార్డు ద్వారా డబ్బులను చెల్లించాడు. దాదాపుగా ఒకటిన్నర నిమిషం పాటు ఆ వీడియో ఉంది. ప్రస్తుతం ఈ వీడియోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్టార్ హీరో అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. బైక్ ట్రిప్ సందర్భంగా స్టార్ హీరో కొంత మంది అభిమానులకు ఫొటోలు కూడా ఇచ్చాడు. ఆ పిక్స్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక కెరీర్ విషయానికి వస్తే.. అజిత్ ప్రస్తుతం హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా ‘ఏకే-61’ అని పెట్టారు. మంజు వారియర్ (Manju Warrier) హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్ర ఖని (Samuthirakani) విలన్ పాత్రను పోషిస్తున్నాడు. జాన్ కొక్కెన్, కవిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ పూర్తి కాగానే ‘ఏకే-62’ ను పట్టాలెక్కిస్తాడు. ‘ఏకే-62’కు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. లైకా  ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International