Advertisement

ప్రారంభమైన `అయ్యప్పన్` రీమేక్!

Jan 25 2021 @ 11:43AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి `అయ్యపనుమ్ కోషియం` తెలుగు రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్నారు.


ఈ రోజు (సోమవారం) ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాత సోషల్ మీడియా ద్వారా తెలిపారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ ఫైట్‌తో చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. మంగళవారం నుంచి పవన్ ఈ సెట్‌కు రాబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే మొత్తం సెట్స్ వేసి షూటింగ్ జరపబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన సాయిపల్లవి, రానా సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. మురళీ శర్మ, బ్రహ్మాజీ, సముద్ర ఖనీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

 
Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.