‘ఆకాశ ఎయిర్‌’ టేకాఫ్‌

ABN , First Publish Date - 2022-08-08T06:36:13+05:30 IST

దేశంలో మరో బడ్జెట్‌ విమానయాన సంస్థ ప్రారంభమైంది. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులతో ఏర్పడిన ‘ఆకాశ ఎయిర్‌’ ఆదివారం నుంచి వాణిజ్య

‘ఆకాశ ఎయిర్‌’ టేకాఫ్‌

న్యూఢిల్లీ: దేశంలో మరో బడ్జెట్‌ విమానయాన సంస్థ ప్రారంభమైంది. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులతో ఏర్పడిన ‘ఆకాశ ఎయిర్‌’ ఆదివారం నుంచి వాణిజ్య స్థాయిలో తన విమాన సర్వీసులు ప్రారంభించింది. ముంబై-అహ్మదాబాద్‌’ మధ్య తొలి ఆకాశ ఎయిర్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా వర్చువల్‌గా ప్రారంభించారు. కేవలం 12 నెలల్లో తమ విమానయాన సంస్థకు అన్ని అనుమతులు ఇచ్చినందుకు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా.. సింథియాకు కృతజ్ఞతలు తెలిపారు. భారత విమానయాన చరిత్రలో ఇదో కొత్త అధ్యాయమని సింథియా అన్నారు. 

Updated Date - 2022-08-08T06:36:13+05:30 IST