ఆకాశ రామన్న ఉత్తరాల హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-01-23T06:47:35+05:30 IST

ఊరూ లేదు.. పేరూ లేదు.. తమకు గిట్టనివారు అయితే చాలు ఆకాశ రామన్న పేరిట ఉత్తరాలు రాసి వారిని మానసిక వేదనకు గురిచేయడం ఆ శాఖలో పరిపాటిగా మారింది. ఆ శాఖలో ఆకాశ రామన్న ఫిర్యాదులకే ఆదరణ ఎక్కువైంది. నీకు ఎవరైనా నచ్చలేదా? ఆకాశరామన్న పేరిట ఉన్నది లేనట్టుగా రాసి లేఖ రాస్తే చాలు ఆ శాఖ అధికారులు ఆగమేఘా ల మీద విచారణ జరుపుతారు.

ఆకాశ రామన్న ఉత్తరాల హల్‌చల్‌
జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయం

టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌లో సహోద్యోగులపైనే ఉత్తరాలు
గిట్టని వారిపై కల్పిత ఉత్తరాలు
విచారణతో మానసిక వేదనకు గురవుతున్న ఉద్యోగులు

సుభాష్‌నగర్‌, జనవరి 22: ఊరూ లేదు.. పేరూ లేదు.. తమకు గిట్టనివారు అయితే చాలు ఆకాశ రామన్న పేరిట ఉత్తరాలు రాసి వారిని మానసిక వేదనకు గురిచేయడం ఆ శాఖలో పరిపాటిగా మారింది. ఆ శాఖలో ఆకాశ రామన్న ఫిర్యాదులకే ఆదరణ ఎక్కువైంది. నీకు ఎవరైనా నచ్చలేదా? ఆకాశరామన్న పేరిట ఉన్నది లేనట్టుగా రాసి లేఖ రాస్తే చాలు ఆ శాఖ అధికారులు ఆగమేఘా ల మీద విచారణ జరుపుతారు. నిజమెంతో? అబద్దమెంతో? తెలుసుకోకుండానే ఫిర్యాదుపై హడావుడి చేస్తారు. దీంతో ఆ శాఖలో ఉద్యోగులు హడలెత్తిపోతున్నా రు. దీంతో ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగులు గుర్రుమంటున్నారు. నిజామాబా ద్‌ ఎన్‌పీడీసీఎల్‌ శాఖలో ఈ రకమైన ఫిర్యాదులతో గందరగోళం నెలకొంది. నిజామాబాద్‌ శాఖ పరిధిలోని ఎన్‌పీడీసీఎల్‌లో రెండు వేల మంది పనిచేస్తారు. వీరిలో కొంతమందిపై సహజంగా ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అవినీతి అక్రమాలకు పాల్పడేవారిపై అనేక వివాదాలు ఉన్నాయి. ఈ కోవలోనే కొంతమంది సిబ్బందిపై దురుద్దేశంతో ఆకాశ రామన్న ఉత్తరాలు వెలుస్తున్నాయి.
గిట్టనివారిపై ఫిర్యాదుల పరంపర
అదేశాఖకు చెందిన ఉద్యోగులు తమకు గిట్టనివారిపై ఆకాశ రామన్న ఉత్తరా ల ద్వారా ఫిర్యాదు పంపుతున్నారు. సాదారణంగా ఒక అదికారిపై ఉద్యోగి ఫిర్యా దు చేయాలంటే ఆరోపణలకు సంబందించి ఆధారాలుచూపించాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసే వ్యక్తి పూర్తి వివరాలు వెల్లడించాలి. వాటి ఆదారంగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగిన ఆధారాలు ఉంటే శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్‌పీడీసీఎల్‌లో కొంతమంది సిబ్బందిపై ఊరుపేరు తెలియకుండా ఆకాశ రామన్న ఉత్తరాలు కుప్పలు తెప్పలుగా వరంగల్‌లోని ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నాయి. ఫిర్యాదు ఎవరు చేస్తున్నారో తెలియకుండానే ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నారు. ఆ ఫిర్యాదులో నిజాయతి లేకపోయినప్పటికీ ఆగమేఘాల మీద ఉన్నతాధికారు లు స్పందించి విచారణ పేరిట కార్యాలయంలో హడావిడి చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు, అధికారులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇటీవల బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారిపై ఏకంగా 50కి పైగా ఆకాశ రామన్న ఉత్తరాలు వె ళ్లాయంటే ఆకాశ రామన్న ఉత్తరాల ప్రాముఖ్యత ఆశాఖలో ఏపాటిదో అర్థమవుతుంది. దాదాపు 50కి పైగా ఆకాశ రామన్న ఉత్తరాలపై విచారణ జరిపిన అందులో విచారణ అదికారులు ఏమీ తేల్చలేకపోయారు. దీంతో ఆకాశ రామన్న ఉత్తరాలు తమకు అనుకూలంగా లేనివారిపై ఉత్తరాలు రాస్తూ సహోద్యుగులను మానసికంగా వేధిస్తున్నారు. ఇప్పటికైనా ఆకాశరామన్న ఉత్తరాలు మాని విధులు సరిగా నిర్వర్తించాలని సహ ఉద్యోగులు కోరుతున్నారు.
డబ్బులు దండుకుంటున్న కొందరు ఉద్యోగులు
ఆకాశరామన్న ఉత్తరాలు రాసేది వారే. పెద్దసార్‌తో మాట్లాడతానని చెప్పేది వారే. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు ఉద్యోగులు డబ్బులు దండుకుంటున్నారు. ఆకాశరామన్న ఉత్తరాల మీద విచారణ చేస్తున్నారని కార్యాలయంలో తెలియగానే ఉద్యోగులు మానసికస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ఉద్యోగులు బేరసారాలు చేస్తూ డబ్బులను దండుకుంటున్నారు.

Updated Date - 2022-01-23T06:47:35+05:30 IST