Advertisement

రాజమౌళి చేతుల మీదుగా...

Mar 5 2021 @ 22:51PM

సముద్రఖని, వినయ్‌ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్‌ ప్రధాన తారలుగా నటించిన చిత్రం ‘అకాశవాణి’. శుక్రవారం సినిమా టీజర్‌ను రాజమౌళి విడుదల చేశారు. ‘ఆకాశవాణి’ భారీ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అడవికి సమీపంలోని ఓ గ్రామం, అందులోని ప్రజానీకం, అడవి మనిషిని చూసి చిన్నపిల్లాడు భయపడటం, రాత్రిళ్లు గ్రామస్తులు దేనికోసమో అన్వేషణ సాగించడం... టీజర్‌లో చూపించారు. చివర్లో ‘ఇక్కడేదో తప్పు జరుగుతోంది’ అని సముద్రఖని చెప్పే డైలాగ్‌ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. అశ్విన్‌ గంగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, సంగీతం: కాలభైరవ.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.