ప్రారంభమైన అఖండ హరినామ సప్తాహం

ABN , First Publish Date - 2022-01-26T06:59:37+05:30 IST

మండలంలోని చించాల గ్రామంలో గల హను మాన్‌ ఆలయంలో మంగళవారం అఖండ హరినామ సప్తాహం అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రారంభమైన అఖండ హరినామ సప్తాహం
సప్తాహంలో పాల్గొన్న భక్తులు

ముథోల్‌, జనవరి, 25 : మండలంలోని చించాల గ్రామంలో గల హను మాన్‌ ఆలయంలో మంగళవారం అఖండ హరినామ సప్తాహం అంగరంగ వైభవంగా జరిగింది. నారాయణ్‌ మహారాజ్‌ యాతల్‌కర్‌ నేతృత్వంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఈ సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వ హిస్తారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరూ వేకువజాముననే హనుమాన్‌ ఆలయా నికి వెళ్లి కాగడ హారతిలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం భజన బృందాలు, మహారాజులు పాల్గొంటారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-01-26T06:59:37+05:30 IST