Advertisement

అభిమానుల కోరిక మేరకు 'బ్యాచ్‌లర్‌' ప్రీ టీజర్‌

Oct 17 2020 @ 20:53PM

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్'. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన అనుమతులతో ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ పునః ప్రారంభమైంది. ఇప్పటి వరకు అఖిల్‌ చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్‌ సాధించకపోవడంతో.. ఈ చిత్రంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. నాగచైతన్యకు '100పర్సంట్‌ లవ్‌' చిత్రాన్ని ఇచ్చిన అల్లు అరవింద్‌, అఖిల్‌కి కూడా ఈ చిత్రంతో మెమరబుల్‌ హిట్‌ ఇస్తాడని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్ర ప్రీ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది.

Advertisement

అభిమానుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా.. ఈ చిత్ర ప్రీ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లుగా చెబుతూ.. నెట్‌లో అభిమానులు ఈ సినిమా కోసం ఏ విధంగా సెర్చ్‌ చేస్తున్నారో తెలిపే పోస్టర్స్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. అభిమానుల కోరిక మేరకు ఈ చిత్ర ప్రీ టీజర్‌ను 19 అక్టోబర్‌, ఉదయం 9 గంటల 39 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌ నిర్మాతలు.


Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.