ధర్నాలు, నిరసనలపై నిషేధాన్ని ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2022-06-29T06:08:07+05:30 IST

భానుగుడి (కాకినాడ), జూన్‌ 28: కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ధర్నాలు, నిరసనలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, భారత రాజ్యా ంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణ

ధర్నాలు, నిరసనలపై నిషేధాన్ని ఎత్తివేయాలి
కాకినాడ సీఐటీయూ కార్యాలయంలో నేతలను నిర్బంధం చేసిన పోలీసులు

అఖిలపక్షం నాయకుల డిమాండ్‌ 

భానుగుడి (కాకినాడ), జూన్‌ 28: కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ధర్నాలు, నిరసనలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, భారత రాజ్యా ంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయి ంచిన నేపథ్యంలో వామపక్షాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఆర్‌పీఐ రాష్ట్రకార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజును గృహ నిర్బంధం చేయడంతో పాటు సీఐటీయూ కార్యాలయంలో దువ్వా శేషుబాబ్జి, పలివెల వీరబాబు, ఎం.రాజశేఖర్‌ను నిర్బంధించారు. దువ్వా శేషుబాబ్జి మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాలు నిషేధిస్తూ రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టరేట్‌ వద్ద గతం నుంచి జరుగుతున్న విధంగానే ధర్నాలు చేసుకునేలా వినతిపత్రం సమర్పించుకునే అవకాశాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగం చట్టవిరుద్ధంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. జూలై 4న అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-06-29T06:08:07+05:30 IST