యూపీ ఫలితాలపై అఖిలేష్ తొలి స్పందన

ABN , First Publish Date - 2022-03-11T21:44:51+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీ గెలుపును..

యూపీ ఫలితాలపై అఖిలేష్ తొలి స్పందన

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీ గెలుపును నిలువరించలేక పోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తొలిసారిగా స్పందించారు. బీజేపీ సీట్ల సంఖ్యను సమాజ్‌వాదీ పార్టీ తగ్గించగలిగిందని చెప్పారు. సగానికి పైగా గందరగోళాలు, భ్రమలు తొలగిపోయాయని, తక్కిన భ్రమలు కూడా కొద్ది రోజుల్లోనే తొలగిపోతాయని పరోక్షంగా కమలం పార్టీని ఉద్దేశించి అఖిలేష్ ట్వీట్ చేశారు. బీజేపీ సీట్లను సమాజ్‌వాదీ పార్టీ తగ్గించ గలిగిందని, సమాజ్‌వాదీ పార్టీ ఓట్ షేర్ కూడా ఒకటిన్నర రెట్లు పెరిగిందని చెప్పారు. ఇందుకు యూపీ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2017లో ఎస్‌పీకి ఓట్ షేర్ 21.85 శాతం ఉండగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అది 32.06కు చేరిందని చెప్పారు.


అఖిలేష్ యాదవ్ ఈ ఎన్నికల్లో కర్హల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఎస్‌పీ సింగ్ బఘెల్‌పై గెలుపు సాధించారు. అయితే పార్టీ అధికారంలో రావడానికి అవసరమైన 202 సీట్ల మార్క్‌ను చేరుకోలేకపోయింది. 111 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే 2017లో కేవలం 47 సీట్లు గెలుచుకున్న ఎస్‌పీ ఈసారి 111 సీట్లు సాధించడం ద్వారా బలం పెంచుకుంది.

Updated Date - 2022-03-11T21:44:51+05:30 IST