హిందుత్వంపై Akhilesh విమర్శలు కొత్తకాదు: UP డిప్యూటీ CM

ABN , First Publish Date - 2022-05-20T18:40:44+05:30 IST

గురువారం లఖ్‌నవూలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయోధ్య ప్రస్తావన గురించి విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మన హిందుత్వంలో ఏదైనా ఎక్కడైనా ఒక రాయిపై కానీ రావి చెట్టుపై కానీ ఎర్ర జెండా పాతితే వెంటనే ఆ ప్రాంతం దేవాలయంగా మారిపోతుంది’’ అని..

హిందుత్వంపై Akhilesh విమర్శలు కొత్తకాదు: UP డిప్యూటీ CM

లఖ్‌నవూ: రావి చెట్టు కింద ఎర్ర జెండా పెడితే అది దేవాలయంగా మారుతుందంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) చేసిన వ్యాఖ్యలపై యూపీ ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) కేశవ్ ప్రసాద్ మౌర్య(Kehsav Prasad Maurya) మండిపడ్డారు. అఖిలేష్ సనాతన హిందుత్వం(Sanatan Hinduism) యొక్క సారాంశాన్ని మర్చిపోయారని, ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు కొత్త కాదంటూ విమర్శించారు. అఖిలేష్ బుజ్జగింపు మత్తు రాజకీయాల్లో ఉన్నారంటూ మౌర్య ఎద్దేవా చేశారు. శుక్రవారం తన ట్విట్టర్ ద్వారా అఖిలేష్‌పై విమర్శలు గుప్పించారు.


గురువారం లఖ్‌నవూలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయోధ్య ప్రస్తావన గురించి విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మన హిందుత్వంలో ఏదైనా ఎక్కడైనా ఒక రాయిపై కానీ రావి చెట్టుపై కానీ ఎర్ర జెండా పాతితే వెంటనే ఆ ప్రాంతం దేవాలయంగా మారిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా, అఖిలేష్ వ్యాఖ్యలపై మౌర్య స్పందిస్తూ ‘‘అఖిలేష్ బుజ్జగింపు రాజకీయాల మత్తులో ఉన్నారు. ఆయన సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని మర్చిపోయారు. ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు కొత్త కాదు’’ అని ట్వీట్ చేశారు.


ఒకవైపు వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై తీవ్ర దుమారం చెలరేగుతుంటే అఖిలేష్ పై విధంగా వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడినట్లు సర్వే అధికారులు తాజాగా వారణాసి కోర్టుకు తెలిపారు. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వేలో పుష్పాలు, కలశం నగిషీలు, పురాతన హిందీ అక్షరాలను స్తంభాలపై చెక్కిన ఆనవాళ్లు గుర్తించినట్టు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. మసీదు బేస్‌మెంట్‌లోని పిల్లర్లపై పుష్పాలు, కలశం నగిషీలు ఉన్నాయని, అక్కడే ఒక పిల్లర్‌పై పురాతన హిందీ అక్షరాలు చెక్కి ఉన్నాయని, బేస్‌మెంట్‌లోని ఓ గోడపై త్రిశూలం చిహ్నం ఉందని తెలిపారు. మసీదు వెనుక గోడ నుంచి రెండు పెద్ద పిల్లర్లు, ఒక ఆర్చి పొడుచుకువచ్చినట్టు ఉన్నాయని, అవి ఆలయ అవశేషాలేనని పేర్కొన్నారు. మసీదు మధ్య గుమ్మటం కింద శంఖాకార నిర్మాణం ఉందన్నారు. దీనిపై సుప్రీంలో విచారణ కొనసాగుతోంది.

Updated Date - 2022-05-20T18:40:44+05:30 IST